వందల సినిమాల స్టార్ హీరో, తొలి సినిమాకు మాత్రం మోక్షం లేదు!
నటుడు మమ్ముట్టీ ఇటీవలే 50 సంవత్సరాల సినిమా కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమల్లో సుదీర్ఘకాలంగా యాక్టివ్ గా ఉన్న నటుల్లో మమ్ముట్టీ ముందు వరసలో ఉంటాడు. కేవలం సీనియర్ గా మాత్రమే గాక స్టార్ హీరోగా, ఇతర భారతీయ భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న నటుడిగా మమ్ముట్టీ నిలుస్తారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు.
నటుడిగా, హీరోగా... పలు అరుదైన ఫీట్లు మమ్ముట్టీ ఖాతాలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఒకే సంవత్సరం అత్యధిక సినిమాల్లో నటించడం. 1980లలో మమ్ముట్టీ ఎంత వేగంగా సినిమాలు చేశాడంటే.. అప్పట్లో ఏడాదికి కనీసం ముప్పై సినిమాలు కూడా విడుల అయ్యాయి. వరసగా కొన్నేళ్ల పాటు ఆ ఫీట్ సాధ్యం అయ్యింది మమ్ముట్టీకి. 80లలో నాలుగేళ్ల వ్యవధిలోనే 120 సినిమాలకు పైగా నటించాడు. అందులో ఒక సంవత్సరంలో 34 సినిమాలు విడుదల ఒక రికార్డు!
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు ఏడాదికి 12కు పైగా విడుదల కావడం ఒక రికార్డు. అలాంటి మమ్ముట్టీ ఏకంగా 30కిపై గా సినిమాలు, అది కూడా లీడ్ రోల్ లో అంటే మమ్ముట్టీ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ మమ్ముట్టీ అటు ఇటుగా 400 సినిమాల వరకూ నటించి ఉంటారనేది ఒక లెక్క. వీటిలో అత్యధికం లీడ్ రోల్ సినిమాలే. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇన్ని సినిమాల్లో నటించడం వైవిధ్యతకు తార్కాణంగా నిలుస్తుంది.
మమ్ముట్టీ కెరీర్ కు సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. వందల సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరో తన కెరీర్ లో తొలిసారి హీరోగా నటించిన సినిమా మాత్రం విడుదల కాలేదు. దేవలోకం అనే సినిమాతో మమ్ముట్టీ తొలిసారి హీరో అయ్యాడు. అప్పటికే లా చదివిన ఈయన సినిమాల వైపు వచ్చాడు. త్వరగానే హీరోగా అవకాశం వచ్చినా.. ఆ సినిమా విడుదలకు మాత్రం మోక్షం లభించలేదు. ఇప్పటికీ ఆ సినిమా మమ్ముట్టీ ఆన్ రిలీజ్డ్ సినిమాల జాబితాలో తొలి స్థానంలో ఉంటుంది. మరి తొలి సినిమానే విడుదలకు నోచుకోకపోయినా.. ఆ తర్వాత మాత్రం మమ్ముట్టీ తిరుగులేని స్థాయికి చేరడం ఆయన కెరీర్ గమనంలోని గొప్ప విశేషం.