త్రివిక్ర‌మ్ తో హ్యాట్రిక్ స‌రే రాజ‌మౌళితో లేన‌ట్టేనా?

Update: 2021-04-14 00:30 GMT
కొన్ని క‌ల‌యిక‌లు అనూహ్యం. ఇటీవ‌లి కాలంలో ఒక‌సారి ప్ర‌క‌టించేసిన‌ సినిమా కూడా గ్యారెంటీగా సెట్స్ కెళుతుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. స్క్రిప్టు వంద‌శాతం కుద‌ర‌క‌పోయినా ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఎదురైనా ఆ ప్రాజెక్ట్ ని డ్రాప్ అవుతున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ అలానే డ్రాప‌వ్వ‌డం తెలిసిన‌దే.

ప్రస్తుతానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం లేదని స్పష్టంగా వెల్ల‌డైంది. ఎన్టీఆర్ 30 కోసం కొరటాల శివను ఎన్నుకోవడంతో వారి చిత్రం నిలిచిపోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి పనిచేస్తారని మే 31 న ప్రారంభమ‌వుతుందని ఫిల్మ్ సర్కిల్స్ ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అత‌డు- ఖలేజా తర్వాత ఈ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ ప్ర‌య‌త్న‌మిది.

మహేష్ లేదా త్రివిక్ర‌మ్ నుంచి కానీ హారిక బృందాల నుంచి కానీ దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడాల్సి ఉంటుంది. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ లో ఉండ‌గానే.. త్రివిక్రమ్ తో షూటింగ్ కి వెళ‌తార‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు రాజ‌మౌళితోనూ మ‌హేష్ సినిమా చేయాల్సి ఉండ‌గా.. ఆ సినిమా ఎప్ప‌టికి చిత్రీక‌ర‌ణ‌కు వెళుతుంది? అన్న‌దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News