సాయిప‌ల్ల‌వి, నిత్యామీన‌న్ లా తెలుగు న‌టి ప్లానింగ్!

నిక్క‌మైన నీలం మొక్క‌టి చాలు..త‌ళుకు బెళుకురాళ్లు త‌ట్టడేలా? అనే వేమ‌న ప‌ద్యాన్ని అంద‌రి అనుస రించ‌లేరు.;

Update: 2026-02-18 03:15 GMT

నిక్క‌మైన నీలం మొక్క‌టి చాలు..త‌ళుకు బెళుకురాళ్లు త‌ట్టడేలా? అనే వేమ‌న ప‌ద్యాన్ని అంద‌రి అనుస రించ‌లేరు. అలా కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. వీరిలో సాయి ప‌ల్ల‌వి, నిత్యామీన‌న్ ప్ర‌ముఖంగా చెప్పొచ్చు. ఈ భామ‌లిద్ద‌రు సినిమాల ప‌రంగా ఎంత సెల‌క్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ‌, అందులో త‌మ పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త ఏంటి? అన్ని విశ్లేషించుకుని క‌మిట్ అవుతారు. ఏడాదిలో ఆరేడు సినిమాలు చేయ‌డం క‌న్నా? మంచి సినిమాలు రెండు చేసినా చాలు అనుకుంటారు. అంత సెల‌క్టివ్ గా ఉన్నారు కాబ‌ట్టే త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటారు. పాత్ర‌లో వెయిట్ లేక‌పోతే క‌మిట్ అవ్వ‌రు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే త‌ర‌హాలో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చారు. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతున్నారు. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా నితీష్ తివారీ ఏరికోరి మ‌రీ సాయి ప‌ల్ల‌విని సీత పాత్ర‌కు ఎంపిక చేసారు? అంటే ఆమె ప్ర‌త్యేక‌త ఏంటి? అన్న‌ది మ‌రో సారి హైలైట్ అవుతుంది. బ‌ల‌మైన పాత్ర‌లు పోషించాలంటే అందులో నిత్యామీన‌న్ మాత్రమే న‌టించాల‌ని న‌మ్మే ద‌ర్శ‌కులెంతో మంది ఉన్నారు. వీళ్లిద్ద‌ర్నీ తెలుగు యువ‌ న‌టి శివానీ నాగారం బాగా స్ట‌డీ చేసింది.

అందుకే వారి బాట‌లోనే ప‌య‌నించాల‌ని బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకుని ముందుకెళ్తున్న‌ట్లు తెలిపింది. త‌న‌కు వంద సినిమాలు చేయ‌డం క‌న్నా చేసిన‌వి ఐదు సినిమాలే అయినా అవి జీవితాంతం గుర్తుండాలి అంటోంది. అలాంటి పాత్ర‌లకు మాత్ర‌మే క‌మిట్ అవుతానంటోంది. క‌థ న‌చ్చిందంటే కాంబినేష‌న్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానంటోంది. ప్ర‌స్తుతం నటుల‌తో పాటు ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు పెరిగారు. తెలుగు వారికి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆ అవ‌కాశాల్ని తెలివిగా అందుకోగ‌ల‌గాలి. అందుకు గ‌తంలో తామెంత ఉత్త‌మంగా ప‌నిచేసాం అన్న‌ది కీల‌కంగా ప‌నిచేస్తుందంది.

చిన్న సినిమా- పెద్ద సినిమా అనే తేడాలు త‌న ద‌గ్గ‌ర ఉండ‌వంది. క‌థ , పాత్ర న‌చ్చితే ఎలాంటి సినిమా అయినా అంగీక‌రిస్తానంది. కెరీర్ ఆరంభంలో కొంద‌రు వెంట వెంట‌నే సినిమాలు చేయ‌కపోతే ఇండ‌స్ట్రీలో అడ్ర‌స్ లేకుండా పోతావ్ అన్నారు. కానీ వారి మాట‌ల్ని ఏనాడు త‌ల‌కెక్కించుకోలేదు. వినేవాళ్లు ఉంటే చెబుతూనే ఉంటార‌ని..తాను అనుకున్నదే చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది. యూట్యూబ్ సిరీస్ ల‌తో వెలుగులోకి వ‌చ్చినా శివానీ వెండి తెర‌కు అన‌తి కాలంలోనే ప్ర‌మోట్ అయింది. తొలి సినిమా `అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్` తో వెలుగులోకి వ‌చ్చింది. ఈసినిమా మంచి విజ‌యం సాధించింది. అనంత‌రం `లిటిల్ హార్స్ట్` అంటూ మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. `హే భ‌గ‌వాన్` అంటూ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. ఈసినిమా విజ‌యం సాధిస్తే అమ్మ‌డి ఖాతాలో తొలి హ్యాట్రిక్ న‌మోద‌వుతుంది.

Tags:    

Similar News