టాలీవుడ్ రీసెంట్ కాస్ట్ ఫెయిల్యూర్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది భారీ బడ్జెట్‌తో రూపొందించిన క్రేజీ సినిమాలు విడుదలయ్యాయి.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది భారీ బడ్జెట్‌తో రూపొందించిన క్రేజీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో పాన్ ఇండియా సినిమాలు, క్రేజీ స్టార్లు నటించిన మూవీస్ ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్‌లు కావడంతో ఆయా సినిమాలపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఆయా సినిమాలు ముందు హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేక బ్రేక్ ఈవెన్‌ని సాధించలేక కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచి షాక్ ఇచ్చాయి.
గట్టి నమ్మకంతో కోట్లు ఖర్చ పెట్టి తీసిన నిర్మాతలకు అదే స్థాయిలో నష్టాలని తెచ్చి పెట్టాయి. మార్చి 28న నితిన్ కథానాయకుడిగా నటించి మూవీ `రాబిన్ హుడ్` విడుదలైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. ముందు రష్మిక మందన్నని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. డేట్స్ సమస్య కారణంగా తను ఈ మూవీ నుంచి తప్పుకుంది.
ఆ తరువాత తన స్థానంలో రాశీఖన్నాని ఫైనల్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఫైనల్‌గా శ్రీలీలని తీసుకున్నారు. 2024 జనవరిలో అనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా డిసెంబర్ వరకు పూర్తియింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక అథిది పాత్రలో కనిపించాడు. కేతిక స్పెషల్ ఐటమ్ నంబర్ చేసింది. హైదరాబాద్, మున్నార్, ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లలో షూటింగ్ చేశారు. 2024 డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకుని ఫైనల్‌గా 2025 మార్చి 25న రిలీజ్ చేశారు. దీనికైన బడ్జెట్ రూ..60 కోట్లు.. ఫస్ట్ డే యావరేట్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో బ్రేక్ ఈవెన్‌ని సాధించలేకపోయింది.
రూ..60 కోట్లు పెడితే వచ్చింది రూ.14 కోట్లు మాత్రమే. ఇక కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన `కుబేర` మూవీ పరిస్థితి దీనికి కొంచెం భిన్నంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.120 కోట్లకు పైనే. జూన్ 20న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నా టాక్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించలేకపోయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.118 కోట్లు మాత్రమే రాబట్టి కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఇదే ఏడాది జూలై 31న విడుదలైన క్రేజీ మూవీ `కింగ్‌డమ్`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. శ్రీలంకలోని జాఫ్నా నేపథ్యంలో సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని గౌతమ్ తిన్ననూరి రూపొందిచాడు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. భారీ అంచనాల మధ్య సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.130 కోట్లు. డివైడ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫైనల్‌గా రాబట్టింది మాత్రం రూ.82 కోట్లు మాత్రమే. క్రేజీ ప్రాజెక్ట్‌గా వైరల్ అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ క్యారెక్టర్‌లో నటించిన మూవీ `ది గాళ్ ఫ్రెండ్`. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. `దసరా` ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. స్వతంత్ర భావాలు గల ఓ యువతి నేపథ్యంలో సాగే కథగా ఓ మంచి సందేశంలో దీన్ని రూపొందించారు. దీనికి అయిన బడ్జెట్ రూ.42 క్రోర్స్. వచ్చింది 29.19 కోట్లు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ని, విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా నటించి మూవీ `ఛాంపియన్`. 1947 టైమ్‌లో తెలంగాణలోని బైరాన్ పల్లిలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ టైమ్ పీరియడ్ స్టోరీతో ఈ మూవీని రూపొందించారు. దీనికి అయిన బడ్జెట్ రూ.45 కోట్లు. టాక్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో సినిమా వసూళ్లని రాబట్టలేకపోయింది. కేవలం రూ.11 కోట్లు మాత్రమే రాబట్టి కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ జాబితాలో చేరింది.