ఉగాది స్పెషల్ గా మహేష్ మేనల్లుడి సర్ప్రైజింగ్ పోస్టర్..!

Update: 2021-04-13 10:30 GMT
నటశేఖర కృష్ణ మనవడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వదిలిన 'జుంబారే జుమ్ జుంబారే' రీమిక్స్ సాంగ్ మరియు ఇటీవల హీరో అశోక్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజాగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో హీరో అశోక్ గల్లా పెద్ద హ్యామర్(సుత్తి) పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇది చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతోందని అర్థం అవుతోంది. అతి త్వరలో టైటిల్ - టీజర్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. నిజానికి ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ లాంచ్ ఉంటుందని ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. కానీ ఈరోజు ఓ పోస్టర్ ని వదిలి త్వరలో టైటిల్ ని అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.

కాగా, సూపర్ స్టార్ కృష్ణ - గల్లా అరుణ కుమారి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో జగపతి బాబు - సీనియర్ నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    

Similar News