ఆ న‌లుగురికి పిలిచి ఛాన్సిస్తున్న‌ మ‌హేష్

Update: 2020-12-28 05:45 GMT
హిట్టు డైరెక్ట‌ర్ల వెంట ప‌డ‌తాడు మ‌హేష్! అంటూ ఓ ప్ర‌ముఖ‌ స్టార్ డైరెక్ట‌ర్ వేసిన పంచ్ ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అయితే ఇప్పుడు అందుకు పూర్తి ఆపోజిట్ గా అట్ట‌ర్ ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌కు కూడా పిలిచి అవ‌కాశాలిస్తున్నార‌న్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

ప‌రిశ్ర‌మ‌లో ఫేడ‌వుట్ అయిన ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు పిలిచి అవ‌కాశాలిస్తున్న మ‌హేష్ ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ తో కంబ్యాక్ అయిన ఓ ద‌ర్శ‌కుడికి పిలిచి అవ‌కాశం ఇస్తున్నారు. అలాగే ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్లతో ద‌డ‌ద‌డ‌లాడించి ప్ర‌స్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయిన వేరొక పెద్ద ద‌ర్శ‌కుడు కూడా మ‌హేష్ ని స్క్రిప్టుతో ప‌డేయాల‌ని ప్లాన్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న సంగ‌తేమో కానీ.. మిగిలి ముగ్గురూ మాత్రం రేసులో ముందున్నారు.

ఆ ముగ్గురు ఎవ‌రు? అంటే... గుణ‌శేఖర్.. శ్రీ‌నువైట్ల‌.. పూరి జ‌గన్నాథ్.. ఈ ముగ్గురితో మ‌హేష్ ఫిక‌ర్ గురించి తెలిసిన‌దే. ఒక్క‌డు లాంటి క్లాసిక్ హిట్టిచ్చిన గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవిలో మ‌హేష్ కోసం ఓ క్యారెక్ట‌ర్ రాసుకుంటే అందులో న‌టించేందుకు అత‌డు స‌సేమిరా అన్నారు. దాంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా చెడింద‌న్న ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత దూకుడు లాంటి హిట్టిచ్చిన శ్రీ‌నువైట్ల ఆగ‌డు లాంటి డిజాస్ట‌ర్ ఇవ్వ‌డంతో అత‌డిని మ‌హేష్ దూరం పెట్టాడ‌న్న ప్ర‌చారం సాగింది. అలాగే పోకిరి- బిజినెస్ మేన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన పూరి జ‌గ‌న్నాథ్ తో మ‌హేష్ ఫిక‌రేంటో చెప్పాల్సిన ప‌నే లేదు. అయినా ఆ ముగ్గురూ స్క్రిప్టుల‌తో మెప్పిస్తే అవ‌కాశాలిచ్చేందుకు మ‌హేష్ సిద్ధంగా ఉన్నార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

వీళ్ల‌కు స్క్రిప్టులు రెడీ చేయాల్సిందిగా ఆఫ‌ర్లు అయితే ఇచ్చారు. మ‌రి వాటిని రెడీ చేసి మెప్పించి ఒప్పించ‌గ‌ల‌గ‌డం అన్న‌దే అస‌లైన టాస్క్. అస‌లే గుణ‌శేఖ‌ర్.. శ్రీ‌నువైట్ల కెరీర్ డైల‌మా గురించి తెలిసిన‌దే. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి ఊపుమీదున్న మ‌హేష్ ని క‌లిసి న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్క్రిప్టు రెడీ చేయాల్సిందిగా కోరార‌న్న వార్త‌తో ఇంత‌కుముందు తిరిగి పూరీ ఖుషీ అయ్యార‌న్న ప్ర‌చారం సాగిపోయింది. వీళ్ల‌తో పాటు మ‌రో ఫేడ‌వుటైన‌ స్టార్ డైరెక్ట‌ర్ మ‌హేష్ ని స్క్రిప్టుతో లాక్ చేయాల‌న్న పంతంతో ఉన్నార‌ట‌. మ‌రి ఆ న‌లుగురికి మ‌హేష్ తో ఖాయ‌మ‌య్యేదెపుడు? అన్న‌దే ఇప్ప‌టికి స‌స్పెన్స్.

ప‌ర‌శురామ్ తో స‌ర్కార్ వారి పాట పూర్త‌వ్వ‌గానే  రాజ‌మౌళి.. త్రివిక్ర‌మ్ స‌హా ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నార‌న్న క‌థ‌నాలు వినిపిస్తుండ‌గా.. మ‌రి ఆ నలుగురు రీవ్యాంప్ అయ్యేదెపుడు? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News