క్రికెట్ కోచ్ గా మహేష్ ప్రయోగం?
సూపర్ స్టార్ మహేష్ బాబు- అనీల్ రావిపూడి కాంబినేషన్ మరో సినిమాకి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సర్కార్ వారి పాట-ఎఫ్ -3 చిత్రీకరణలు పూర్తికాగానే ఈ జోడీ సెట్స్ కు వెళ్లనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఠఫ్ కాంపిటీషన్ ఉన్నా.. మరోసారి మహేష్ ని లాక్ చేసేందుకు అనీల్ రావిపూడి ఏ ఒక్క అవకాశాన్ని విడిచి పెట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఈసారి మహేష్ కోసం అనీల్ ఎంచుకున్న పాత్ర పైనా లీక్స్ అందాయి. సరిలేరులో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనీల్.. తదుపరి సినిమాలో ఆసక్తికర పాత్రలో చూపిస్తారట. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించనున్నాడని క్రీడా నేపథ్య చిత్రమిదని సోర్సెస్ చెబుతున్నాయి. క్రికెట్ శిక్షకుడి పాత్ర మహేష్ కి నచ్చిందని లీకులందుతున్నాయి. అలాగే అనీల్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఇందులో మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట.
సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అనగానే సీరియస్ యాక్షన్ స్టోరీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బయటకొచ్చిన ప్రచార చిత్రాల్ని బట్టి అనీల్ మార్క్ వినోదాత్మక చిత్రమిదని అర్ధమైంది. సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. అందుకే ఈ జోడీ రిపీటవుతోందనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు అన్ని నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సర్కార్ వారి పాటకు మహేష్.. ఎఫ్ 3కి రావిపూడి బ్రేక్ ఇచ్చారు.