లూసిఫర్ రీమేక్ సుజిత్ బుట్టలో అందుకే పడిందట!

Update: 2020-04-24 07:50 GMT
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించడం చాలామంది దర్శకులకు ఒక కల లాంటింది. ఈమధ్య చిరంజీవి యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నానని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  'ఆచార్య' తర్వాత చిరంజీవి మలయాళం హిట్ 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ ను దర్శకుడిగా ఎంచుకున్నారనే సంగతి తెలిసిందే.  అయితే ఈ ఎంపికపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.

సుజిత్ మేకింగ్ బాగుంటుందని.. కథలో విషయం ఉంటే చక్కగా తెరకెక్కించగలడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం సుజిత్ అనుభవలేమి 'సాహో' విషయంలోనే బయటపడిందని.. మెగాస్టార్ ఇమేజ్ ని.. ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చెయ్యడం సుజిత్ కు కష్టమని అంటున్నారు. నిజానికి ఈ అవకాశం సుజిత్ కు రావడానికి కారణం యూవీ క్రియేషన్స్ వారేనని అంటున్నారు.  ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్.. యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  'సాహో' ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినప్పటికీ యూవీ వారికి.. ప్రభాస్ కు సుజిత్ టాలెంట్ పై గట్టి నమ్మకం ఉందట.  యూవీలో ఒక భాగస్వామి అయిన విక్రమ్ రెడ్డి కి చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. అందుకే సుజిత్ ను సిఫార్సు చేశారని సమాచారం. ప్రభాస్ కూడా సుజిత్ పేరే సూచించడం తో చిరు.. చరణ్ లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

అయితే కెరీర్ లో రెండో సినిమాకే ప్రభాస్ ను.. మూడో సినిమాకు చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టమేనని చెప్పాలి.  నిజానికి ఎంతో మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్లకు కూడా ఇంతవరకూ ఇలాంటి అవకాశం రాలేదు. మరి ఈ సినిమా తో సుజిత్ తన సత్తా చాటుకుంటాడా.. యూవీ వారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News