అక్కినేని హీరో `ల‌వ్ స్టోరి` నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్

Update: 2020-07-01 03:30 GMT
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య `లవ్ స్టోరి` అనే చిత్రం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. 90శాతం చిత్రీక‌ర‌ణ‌ పూర్తయింది. కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య నైజాం యాస మాట్లాడే కుర్రాడిగా న‌టిస్తుండ‌గా.. సాయిప‌ల్ల‌వి అత‌డి ల‌వ‌ర్ గా న‌టిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీ నాన్-థియేట్రికల్ హక్కులను మేకర్స్ 18 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. డిజిటల్- శాటిలైట్ స‌హా డబ్బింగ్ హక్కులు క‌లుపుకుని ఇంత బిజినెస్ సాగింది. చైత‌న్య రేంజుకి ఇది బెస్ట్ బిజినెస్. త్వరలో పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల అన్ని సినిమాల్లానే చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది.

అలాగే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం ఉంది. కానీ థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం మేక‌ర్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. మ‌హ‌మ్మారీ శాంతించి థియేట‌ర్లు తెరుచుకుంటే భారీ ఎత్తున రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. కానీ అందుకు ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌ట్టేట్టు క‌నిపిస్తోంది.
Tags:    

Similar News