#లీసా హెడెన్.. బేబి బంప్ తో ఆ డ్యాన్సులేమిటి?

Update: 2021-02-27 09:30 GMT
నిండు గ‌ర్భిణి ఎక్కువ‌గా శ్ర‌మించ‌కూడ‌ద‌ని కండీష‌న్లు పెడ‌తారు. క‌నీసం మెట్లు కూడా ఎక్క‌కూడ‌దు.. దిగకూడ‌దు. ఏం చేసినా క‌డుపులో బేబి క‌దులుతుంద‌ని అంటారు. కానీ ఇదిగో ఇక్కడ వ్య‌వ‌హారం చూస్తుంటే అలా లేదు. నిండు గ‌ర్భిణి లీసా హెడెన్ ఎలా డ్యాన్సులు చేస్తోందో చూశారు క‌దా?  త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు గ‌ర్భిణులు న‌డుము ఊపుతూ డ్యాన్సులు అద‌ర‌గొట్టేస్తున్నారు. త‌న ఫ్రెండు ఇస‌బెల్లా శ్రీ‌మంతంలోని దృశ్య‌మిది.

నిజానికి గ‌ర్భిణులు క‌ద‌ల‌కూడ‌ద‌ని కొందరు పాత‌కాల‌పు బామ్మ‌లు చెబుతున్నా.. చిన్న‌పాటి ఎక్సర్ సైజులు అవస‌రం అని డాక్ట‌ర్లు చెబుతుంటారు. కాక‌పోతే మూడో బిడ్డ‌కు త‌ల్లి కాబోతున్న లీసా చేస్తున్న‌ది అలా లేదు. ఆ న‌డుము ఊపుడుతో హుషారైన‌ డ్యాన్సులు చేస్తోంది. చూస్తుంటే కాస్త ఊపుడు ఎక్కువైన‌‌ట్టే క‌నిపిస్తోంది.

టాప్ మోడ‌ల్ కం నటి లీసా హెడెన్ ఇంత‌కుముందు రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ చిత్రంలో ఒక స్పెష‌ల్ నంబ‌ర్ లో క‌నిపించింది. 2010లో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ ఇప్ప‌టికి ఎనిమిది సినిమాలు చేసింది. ఏ దిల్ హై ముష్కిల్ ఈ భామ న‌టించిన చివ‌రి సినిమా. లీసా ఇదివ‌ర‌కూ బేబి బంప్ ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలాన్ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.Full View
Tags:    

Similar News