హిందీ కంటే ఇంగ్లీష్ సినిమాలపై జనాల క్రేజ్
కరోనా మహమ్మారి సినీ రంగాన్ని కోలుకోకుండా చేసింది. ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడంతో నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు. సినిమా పూర్తయ్యేసరికి మళ్లీ కరోనా ముప్పు ఎదురవుతుందోనని భయపడుతున్నారు. అయితే కొద్దో గొప్పో థియేటర్లు ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు తక్కువగా ఉండడంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఇండియన్ సినిమాల కంటే ఫారిన్ సినిమాల వైపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ సినిమాలను చూసేందుకు జనం ముందుకు రాకపోవడం ఆందోళనగా మారింది.
రెండు సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమ కుదేలవుతోంది. చిన్న చిన్న సినిమాలు తప్ప భారీ స్థాయిలో నిర్మించిన సినిమా ఇంకా విడుదల కాలేదనే చెప్పాలి. కరోనా వైరస్ తో పాటు బడ్జెట్ కూడా అనువైన స్థాయిలో లేకపోవడంతో చాలా మంది ముందుకు రావడం లేదు. కొందరు ముందుకు వచ్చినా నష్టాల బాటే పడుతున్నారు. ఇటీవల ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్ ’సినిమా విడుదలై బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు అక్షయ్ కుమార్ సినిమా అంటే వారం లోపే సినిమా బడ్జెట్ రికవరీ అయ్యేది. కానీ ఇప్పుడు వారాలు గడుస్తున్నా కనీస కలెక్షన్లు రావడం లేదు.
ఇక అమితాబ్ బచ్చన్ మూవీ చెహ్రె గురించి మాట్లాడాల్సిన పనిలేదు అన్నట్లుగా మారింది. హిందీ సినిమాలు ఏ స్టాయివి అయినా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. చిన్న, మీడియం సినిమాలను కనీసం చూసేవారు కరువయ్యారు. మొత్తానికి బాలీవుడ్ ఆశించిన రివైవల్ కనిపించడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య కొన్ని సినిమాలు రిలీజై కాస్త ఫలితాలనిచ్చాయి. కానీ సెకండ్ వేవ్ తరువాత సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇదే సమయంలో హిందీ చిత్రాలకు బదులను ఆంగ్గ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవల విడుదలయిన ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-9’ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్ కలెక్షన్లతో పాటు రోజూవారీ ఆదాయం కూడా బాగానే పెరుగుతోంది. ఇదే తరహాలో ‘షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు ఉన్నాయి. బెల్ బాటమ్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు రెండు రేట్ల రెట్టింపు వసూళ్లు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని చూడ్డానికి హిందీ ప్రేక్షకులే పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాక మరికొన్ని ఇంగ్లీష్ సినిమాల థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. హాలీవుడ్ మీద ఉన్న ఆసక్తి బాలీవుడ్ మీద లేకపోవడం చిత్ర రంగాన్ని ఆందోళన కలిగిస్తోంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగాన్ని ఆదుకుంటామని చెబుతున్నా ఇలాంటి పరిస్థితులను చూసి నిర్మాతలు సినిమాలు తీసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లోకి తక్కువగా వస్తున్నాయి. మరోవైపు థియేటర్ల పరిస్థితి చూసిన కొందరు ఓటీటీనే నమ్ముకుంటున్నారు. పెద్ద పెద్ద సినిమాలను సైతం వీటితో ఒప్పందం చేసుకొని ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో తాము తీసిన సినిమా ఖర్చుకు కొంత లాభం చూసుకొని విడుదల చేస్తున్నారు. కానీ ఈ సమయంలో కొందరు హీరోల ఫ్యాన్ష్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. థియేటర్లో తమ హీరో మూవీ చూద్దామని అనుకున్న వారు ఓటీటీలో రిలీజ్ చేసేసరికి నిరాశ చెందుతున్నారు. కొందరు మాత్రం థియేర్లోకి రిలీజ్ చేసినా వారికి ఆశించిన లాభాలు రాకపోయేసరికి మిగతా వారు ఓటీటీని నమ్ముకుంటున్నారు.