కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న తొలి పెద్ద పండుగ దసరా సీజన్ లో రిలీజ్ డేట్ కోసం అనేక సినిమాలు పోటీ పడ్డాయి. చివరకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'మహా సముద్రం' 'వరుడు కావలెను' వంటి మూడు క్రేజీ మూవీస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించాయి. అయితే ఇప్పుడు విజయదశమి కి బాక్సాఫీస్ వద్ద ద్విముఖ పోటీగా మారే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'వరుడు కావలెను' చిత్రాన్ని దసరా రేసు నుంచి తప్పించే ఆలోచన చేస్తున్నారట. ఈ సినిమాని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇంతకముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు దీపావళి బరిలో నిలపాలని చూస్తున్నారని.. నవంబర్ 4వ తేదీని లాక్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే సితార టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా, ''వరుడు కావలెను'' చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది లవ్ అండ్ కామెడీ - ఎమోషన్స్ కలబోసిన కుటుంబ కథా చిత్రమని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
'వరుడు కావలెను' చిత్రానికి ఎస్ఎస్ థమన్ - విశాల్ చంద్ర శేఖర్ దీనికి సంగీతం సమకూర్చారు. వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - హిమజ - రజిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు.