బరువు తగ్గిన ఖుష్బుకు చిరు బంపర్‌ ఆఫర్‌

Update: 2020-06-30 10:45 GMT
మెగాస్టార్‌ చిరంజీవి మలయాళ లూసీఫర్‌ చిత్రం రీమేక్‌ లో నటించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. లూసీఫర్‌ చిత్రంలో మోహన్‌ లాల్‌ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్‌ నటించింది. ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాగే చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటుంది. యంగ్‌ హీరోయిన్స్‌ కాకుండా సీనియర్స్‌ అయితేనే ఆపాత్రకు బాగుంటుంది. అందుకే రీమేక్‌ లో ఆ పాత్రను చేయబోతున్నది ఎవరు అనే విషయమై చాలా చర్చ జరుగుతోంది.

మొన్నటి వరకు విజయశాంతి.. సుహాసినితో పాటు కొందరి పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ పాత్రకు గాను ఖుష్బు అయితే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చారట. గతంలో చిరంజీవికి అక్క పాత్రలో ఖుష్బు నటించింది. ఇప్పుడు చెల్లి పాత్రలో ఎలా నటిస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేయవచ్చు. కాని ఆమె గతంతో పోల్చితే ఇప్పుడు చాలా బరువు తగ్గి పదేళ్ల వయసు తగ్గినట్లుగా కనిపిస్తుంది.

ఆ కారణంతోనే ఖుష్బు చిత్రంలో ఆ పాత్రకు చిరంజీవి సిఫార్సు చేసి ఉంటాడు అనేది టాక్‌. ఈ చిత్రంకు సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉండేలా ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ చేశారట. ప్రస్తుతం సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్‌ వర్షన్‌ ను రాస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఆచార్య చిత్రంతో పాటు ఈ చిత్రంను కూడా విడుదల చేయాలనేది మెగా కాంపౌండ్‌ ప్లాన్‌ గా చెబుతున్నారు.
Tags:    

Similar News