కొరటాల సినిమాలన్ని ఆయనకేనట!

Update: 2018-10-10 08:10 GMT
ఇప్పుడున్న ట్రెండ్ హీరోలు దర్శకులు ఎవరైనా సరే తమకంటూ ప్రత్యేకంగా ఒక బ్యానర్ ఉండటం. కొందరు నేరుగా తమ పేరు మీదే నడిపిస్తే మరికొందరు మిత్రుల సహకారంతో వెనుక నడిపిస్తూ వ్యాపారంలో వాటాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఇప్పటి దాకా ఫెయిల్యూర్ చూడని అరుదైన దర్శకుల జాబితాలో ఉన్న కొరటాల శివ ఈ దిశగానే అడుగులు వేస్తున్నాడు. కాకపోతే దీనికి తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ సహాయం తీసుకోనున్నాడు.

యువసుధ ఆర్ట్స్ పేరుతోనే ఇకపైన తన సినిమాల్లో అధిక శాతం నిర్మాణమవుతాయని కొరటాల శివ స్పష్టం చేసాడు. అందులో తాను నిర్మాణ భాగస్వామి అని చెప్పలేదు కానీ ఇంత చొరవ తీసుకుని అందులో తన రాబోయే సినిమాలు ఉంటాయని చెప్పాడు అంటే శివ పార్టనర్ షిప్ లేకుండా ఉండదు.

ఇది అందరు దర్శకులు ఫాలో అవుతున్నదే. పూరికి వైష్ణో అకాడమీ త్రివిక్రమ్ కు హారికా అండ్ హాసిని ఇలా ఎవరికి అనుకూలంగా వాళ్ళు సంస్థలు నిర్వహిస్తున్నారు. కొరటాల కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు అంతే. భరత్ అనే నేను సూపర్ సక్సెస్ తర్వాత కొంత కాలం సైలెంట్ గా శివ త్వరలో మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు అనే వార్త కొద్దిరోజులుగా నానుతూనే ఉంది. చిరుని డ్యూయల్ రోల్ లో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలో చూపించబోతున్నట్టు టాక్ గతంలోనే వచ్చింది. కానీ కొరటాల శివ మాత్రం దాని గురించి విశేషాలు బయటికి చెప్పడం లేదు.
Tags:    

Similar News