మహాప్రస్థానం వందలసార్లు చదివిన దర్శకుడు
ఒకప్పుడు దర్శకులంతా తెలుగు సాహిత్యాన్ని కాచి వడబోసేసే వాళ్లు. తాము చదివిన సాహిత్యం నుంచే కథలు పుట్టించేవాళ్లు. కానీ ఇప్పటి రచయితలు, దర్శకులకు సాహిత్యం మీద పట్టు తక్కువే. హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటి నుంచే కథలు పుట్టేస్తాయని నమ్ముతుంటారు ఈ తరం దర్శకులు. అందుకే చాలామంది రాసే కథల్లో ఒరిజినాలిటీ ఉండదు. కథా బలం కనిపించదు. మాటల్లో లోతూ ఉండదు. ఐతే మిర్చి, శ్రీమంతుడు సినిమాల దర్శకుడు కొరటాల శివ ఈ తరహా దర్శకులకు భిన్నం. అతడికి సాహిత్యం మీద బాగా పట్టుంది. ఆ సంగతి అతడి సినిమాల కథలు, వాటిల్లో అతను రాసిన మాటల్ని బట్టే తెలిసిపోతుంది. విపరీతంగా పుస్తకాలు చదవడం వల్లే తాను కథలు, మాటలు బాగా రాయగలుగుతున్నానని చెబుతున్న కొరటాల.. శ్రీశ్రీ తనకిష్టమైన కవి, రచయిత అని చెప్పాడు
‘‘రచయితగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి పుస్తకాలు బాగా చదవడం అలవాటు చేసుకున్నా. ఇప్పటికీ రోజూ పుస్తకాలు చదువుతుంటా. ఎక్కువగా ఆత్మకథలు చదువుతాను. అయాన్ రాండ్ రచన ఫౌంటెన్ హెడ్ బాగా నచ్చుతుంది. శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని వందలసార్లు చదివాను. ఇప్పటికీ మధ్య మధ్యలో కొన్ని పేజీలు తిరగేస్తే నాకు మళ్లీ మంచి డైలాగులు రాసే శక్తి వస్తుంది. కలంతో మనిషిని కదిలించవచ్చని నాకు తెలియజేసింది మహాప్రస్థానమే. శ్రీశ్రీ సాహిత్యమంతా చదివాను. నేను రచయిత కావడానికి ఒకరకంగా శ్రీశ్రీనే కారణం. ఆయన ఏ విషయాన్నయినా చెప్పే విధానం నాకు నచ్చుతుంది. సూటిగా మొట్టికాయ వేసినట్లు చెబుతారు. నేను కూడా ఆ శైలినే నా సినిమాల్లో ఫాలో అవుతాను’’ అని కొరటాల చెప్పాడు.