'ఆచార్య' కోసం మరో దర్శకుడు కూడా?

Update: 2020-03-02 14:30 GMT
ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాను కూడా హిట్‌ చేసుకున్న సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ. భరత్‌ అనే నేను చిత్రం తర్వాత దాదాపు ఏడాది వరకు గ్యాప్‌ తీసుకున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా రచన సహకారం కోసం ప్రముఖ రచయితలతో కొరటాల శివ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. చిరు మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ఎలాంటి ఛాన్స్‌ తీసుకోకుండా పక్కా స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు. అయితే షూటింగ్‌ సమయంలో చిన్న చిన్న మాడిఫికేషన్స్‌ మరియు ఇతరత్ర అవసరాల కోసం రచయితల టీం వర్క్‌ చేస్తూనే ఉంటుంది.

‘ఆచార్య’ చిత్రం కోసం కొరటాల శివ ఎప్పుడు ఉండే తన రెగ్యులర్‌ రచయితలతో పాటు ఈసారి ప్రత్యేకంగా శ్రీధర్‌ సిపానను కూడా జాయిన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా శ్రీధర్‌ మంచి పేరు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కూడా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సమయంలోనే చిరంజీవి సినిమా అవ్వడంతో ఆచార్యకు ఆ రచయిత నో చెప్పలేక పోయాడట. కొరటాల శివ స్వతహాగా రచయిత అవ్వడం వల్ల ప్రముఖ రచయితల అవసరం ఎప్పుడు పడలేదు.

మొదటి సారి ఆచార్య సినిమా కోసం డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌ అయిన శ్రీధర్‌ తో కలిసి వర్క్‌ చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. కొరటాల శివ గత చిత్రాలను మించి ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఉన్నారు. కనుక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News