చిరు 'రైతు' బాంధ‌వ‌!

Update: 2018-10-10 16:53 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా- న‌ర‌సింహారెడ్డి` ఆన్ లొకేష‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరు కెరీర్ 151వ చిత్ర‌మిది. డాడ్‌ కి కానుక‌గా ఈ చిత్రాన్ని అసాధార‌ణ బ‌డ్జెట్‌ తో నిర్మిస్తున్నాన‌ని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. అందుకు త‌గ్గ‌ట్టే భారీ హిస్టారిక‌ల్ వారియ‌ర్ బ్యాక్‌ డ్రాప్‌ లో - స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుని క‌థ‌తో సినిమా తీస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది.  జార్జియాలోని అరుదైన లొకేష‌న్ల‌లో - టాప్ టెక్నీషియ‌న్స్‌తో ప్ర‌స్తుతం మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. కేవ‌లం క్లైమాక్స్ స‌న్నివేశాల కోసం 50 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ఈ సినిమా సెట్స్‌ లో ఉండ‌గానే చిరు న‌టించే 152వ సినిమా గురించిన అప్‌ డేట్స్ లీక‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

వ‌రుస విజ‌యాల‌తో ఎదురేలేని ద‌ర్శ‌కుడిగా పాపులారిటీ తెచ్చుకున్న కొర‌టాల శివ‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల ప్ర‌స్తుతం చిరుకోసం స్క్రిప్టును పూర్తి చేసే ప‌నిలో బిజీ. భ‌ర‌త్ అనే నేను` త‌ర్వాత కొర‌టాల దృష్టంతా ఈ ప్రాజెక్టు పైనే నిలిపాడు. మూవీకి కావాల్సిన అన్ని ర‌కాల విష‌యాల్ని మెగాస్టార్‌ తో నేరుగానే చ‌ర్చిస్తున్నారు. చిరు అనుభ‌వ పూర్వ‌కంగా ఇచ్చే స‌ల‌హాల్ని - సూచ‌న‌ల్ని తీసుకుంటున్నార‌ట‌. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రారంభం కానుంద‌ని - మార్చి లేదా ఏప్రిల్ 2019లో ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మొద‌లు పెడ‌తార‌ని కొణిదెల కాంపౌండ్ నుంచి ఓ స‌మాచారం లీకైంది.

మిర్చి -శ్రీ‌మంతుడు - జ‌న‌తా గ్యారేజ్ - భ‌ర‌త్ అనే నేను .. ఇలా వ‌రుస‌ బ్లాక్‌ బ‌స్ట‌ర్ విజ‌యాల‌తో వంద శాతం స‌క్సెస్ రేటు ఉన్న కొర‌టాల ఈసారి మెగాస్టార్ ఇమేజ్‌ కి త‌గ్గ క‌థ‌ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఇందులో చిరు రైతు బాంధ‌వుడిగా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత సినారియోలో రైతు స‌మ‌స్య‌ల‌పై సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన కొర‌టాల స‌రైన టైమింగ్‌ తో ఈ స్క్రిప్టుని మ‌లుస్తున్నార‌ట‌. క‌థ‌కు త‌గ్గ‌ట్టే `రైతు` అనే టైటిల్‌ ని అనుకుంటున్నార‌ట‌. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ వేరొక నిర్మాత‌ను క‌లుపుకుని స్వ‌యంగా నిర్మిస్తున్నారు. 
Tags:    

Similar News