అల్లరల్లరితో అల్లు వారి ఇంట సందడి వాతావరణం నింపేస్తుంది అల్లు అర్హ. ఈ చిన్నారి బుడుగు అల్లరిని పలుమార్లు డాడీ అల్లు అర్జున్ స్వయంగా వీడియోలు.. ఫోటోల రూపంలో అభిమానులకు షేర్ చేయడంతో అవి అంతే హాట్ టాపిక్ గా మారాయి. అర్హ క్యూట్ లుక్స్ బ్యూటిఫుల్ స్మైల్ కి ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు.
అన్నట్టు తాజాగా ఓ అరుదైన ఫోటో ఫ్రేమ్ ప్రస్తుతం బన్ని-చరణ్ ఫ్యాన్స్ లోకి దూసుకొచ్చింది. ఈ ఫోటోలో కోడళ్ల నడుమ అల్లరి పిడుగులా ఫోజిచ్చింది అల్లు అర్హ. చరణ్ సతీమణి ఉపాసన ..అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇంట్లో సోఫాలో కూచుని ఉండగా ఆ ఇద్దరి మధ్యా చేరింది `అల్లు`రి పిడుగు. సంక్రాంతి సందర్భంగా ఓచోట కలుసుకుని ఇలా ఇంటిల్లిపాదీ సందడి చేశారని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. కోడళ్లలో స్నేహ పట్టు చీరలో సంక్రాంతి కళను తేగా.. ట్రెడిషనల్ రెడ్ డ్రెస్ లో ఉపాసన ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నారు.
అన్నట్టు అల్లు అర్హ సంక్రాంతి డ్రెస్ ఎంతో ముచ్చటగా ఉంది కదూ? ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు (ఎర్ర కలువ).. దానిపై వెన్న కుండ.. అక్కడ మృధుత్వంతో ఉన్న గోవు .. చూసేందుకు ఆ డిజైనర్ పట్టు టాప్ ఎంతో అద్భుతంగా ఉంది. పరికిణీ- టాప్ లో అర్హ ఎంతో ముద్దొచ్చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ సో క్యూట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.