మళ్లీ వార్తల్లో కీర్తి సురేష్‌ మొదటి తెలుగు సినిమా

Update: 2020-11-25 05:45 GMT
కీర్తి సురేష్‌ మొదటి తెలుగు సినిమా ఏంటీ అంటే  అంతా వెంటనే రామ్‌ తో నటించిన నేను శైలజ అంటారు. కాని అంతకు ముందే కీర్తి సురేష్‌ తెలుగులో ఒక సినిమా నటించింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అయ్యింది. నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా రూపొందిన సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటించింది. ఇద్దరి కాంబోలో షూటింగ్‌ జరిగింది. విడుదలకు కూడా సిద్దం అయ్యింది. కాని ఏవో అడ్డంకుల వల్ల సినిమా ఆగుతూ వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఒక స్టార్‌ హీరోయిన్‌. కనుక ఆ సినిమాను విడుదల చేస్తే మంచి బిజినెస్‌ ఖాయం అనుకున్నారు. అందుకే కొన్ని నెలల క్రితం విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

షూటింగ్‌ కాస్త బ్యాలన్స్‌ ఉంటే పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశారు. ఈ సినిమాకు మొదట అయినా ఇష్టం నువ్వు అని పెట్టారు. కాని ఇప్పుడు సినిమా టైటిల్‌ ను రెండు జడల సీత గా మార్చారు. క్యాచీగా ఉండటంతో పాటు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అన్నట్లుగా టైటిల్‌ ఉండటంతో కీర్తి సురేష్‌ ను ముందు ఉంచి పబ్లిసిటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అయినా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా చూడాలి. థియేటర్లు పునః ప్రారంభం అయిన కారణంగా వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కీర్తి సురేష్‌ సినిమాగా ప్రమోట్‌ చేస్తే ప్రేక్షకులు ఇంట్రెస్ట్‌ చూపించే అవకాశం లేకపోలేదు.
Tags:    

Similar News