• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్-2 టీజర్.. యశ్,...

కేజీఎఫ్-2 టీజర్.. యశ్, ప్రశాంత్ నీల్ కు నోటీసులు!

By - Tupaki Desk
Update: 2021-01-14 04:35 GMT
జనవరి 8వ తేదీన రిలీజైన్ 'కేజీఎఫ్ చాప్టర్-2' సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించింది నెవ్వర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పిందీ టీజర్. సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది.. ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ముహూర్తం పెట్టి టీజర్ రిలీజ్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. కానీ.. ఆలోపే టీజర్ లీక్ కావడంతో అనుకున్న సమయం కన్నా 12 గంటల ముందే టీజర్‌‌ను వదిలేశారు. అయితే.. ఇలా అనుకోకుండా వచ్చినా సరే.. కేజీఎఫ్-2 టీజర్.. సోషల్ మీడియాను షేక్ చేసేసింది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేయడం విశేషం. ఇక, ఈ టీజర్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన తొలి టీజర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా కేజీఎఫ్-1. 2018లో విడుదలైన ఈ ఫస్ట్ పార్ట్ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో.. సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆశించినట్టుగానే.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన టీజర్ ను భారీగా వదిలారు  మేకర్స్. అన్ని భాషల్లో కలిపి ఒకే టీజర్ ను వదలగా.. మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా.. ఈ టీజర్ కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ నోటీసులు అందుకున్నారట! కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ ఈ నోటీసులు పంపించిందట. దర్శకుడు, హీరోతోపాటు నిర్మాత విజయ్ కు నోటీసులు పంపించారట అధికారులు. కారణం ఏమంటే.. రాకీ గన్ తో వాహనాలను షూట్ చేసి వచ్చి, ఆ వేడికి కణకణ మండుతున్న తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు కదా.. అక్కడే అభ్యంతరం తెలిపారు.

ఆ సీన్ దగ్గర "యాంటీ స్మోకింగ్ వార్నింగ్" ఎందుకు వేయలేదనేది వారి అభ్యంతరం. రూల్ ప్రకారం పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే వార్నింగ్ అక్కడ ఇవ్వాల్సి ఉంది. కానీ.. టీజర్లో వేయలేదు. దీంత.. ఎందుకు ఇవ్వలేదని నోటిస్ పంపారట. కాగా.. ఈ అంశాన్ని మేకర్స్ త్వరగానే సెట్ చేసుకుంటారని తెలుస్తోంది.
Tags:    
  • KGF2 
  • Yash 
  • Movie News 
  • Prashant Neil 
  • Latest News 
  • Tupaki Updates 

Similar News

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS