నా పెళ్లిపై మీకు ఎందుకు ఇంత ఆసక్తి.. మహానటి అసహనం
మహానటి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సర్కారు వారి పాట మరియు దసరా సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. మరో వైపు చిరంజీవి సినిమా భోళా శంకర్ లో కీలక పాత్రలో నటించి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు తమిళంలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు తమిళంలో మమన్నన్ సినిమాలో నటించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందిన ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే వైభవంగా జరిగింది.
మమన్నన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ఆ ఆడియో విడుదల సందర్భంగా కీర్తి సురేష్ మరోసారి పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది.
కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది... వరుడు కూడా రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి కదా.. దీనిపై మీ స్పందన ఏంటి అంటూ మీడియా వారు ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు కీర్తి సురేష్ అసహనం వ్యక్తం చేసింది. గతంలో నేను నా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అని చెప్పినా కూడా పదే పదే ఎందుకు పెళ్లి గురించి అడుగుతున్నారు.
నా పెళ్లి గురించి మీకు ఎందుకు ఇంత ఆసక్తి అంటూ ఎదురు ప్రశ్నించింది. నేను పెళ్లికి ఫిక్స్ అయినప్పుడు తప్పకుండా నేనే స్వయంగా చెప్తాను అంటూ ప్రకటించింది. ఇప్పటికి అయినా కీర్తి పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.