ఫోటో స్టొరీ: సింపుల్ గా షాక్ ఇచ్చిందిగా

Update: 2019-04-24 01:30 GMT
అల్ ది గ్రేట్ థింగ్స్ ఆర్ సింపుల్ - విన్ స్టన్ చర్చిల్.  సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని అనువాదం చెయ్యాల్సిన పని లేదు.  అయినా కొంతమంది తెలుగు భాషాభిమానుల హృదయం గాయపడుతుంది కాబట్టి అనువాదం చేసుకుందాం.  గొప్ప విషయాలన్నీ సింపుల్ గా ఉంటాయి అని బ్రిటిష్ పెద్దాయన శెలవిచ్చాడు. ఆయన అంత గట్టిగా చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది.  మరి ఆయన కొటేషన్ కత్రినా కైఫ్ ఫోటోకు లింక్ ఏంటి అంటారా? కత్రినాలాంటి హాట్ హటర్ హాటెస్ట్ బ్యూటీ సింపుల్ గా దర్శనమివ్వడం!

ఈ స్టిల్ కత్రినా కైఫ్ నటిస్తున్న సల్మాన్ ఖాన్ చిత్రం 'భారత్' లోనిది. దీనికి కత్రినా ఇచ్చిన క్యాప్షన్ "కుముద్ రైనా 1975.  దర్శకుడు అలీ అబ్బాస్ జఫార్ తో మూడు సినిమాలు చేసిన నేను ఈ పాత్రను పోషించడాన్ని నేను ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను.  ఇదో వండర్ ఫుల్ జర్నీ.  ఈ పాత్రను మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని నేను ఆతృతగా ఉన్నా."  'భారత్' లో కుముద్ పాత్ర గెటప్ ఇది.  ఎంత సింపుల్ గా ఉందో అంత ఎఫెక్టివ్ గా ఉంది.

లైట్ కలర్లో ఉన్న ఒక సింపుల్ చీరలో మేకప్ లేకుండా.. ఆభరణాలు అసలే లేకుండా.. లూజ్ గా వదిలేసిన హెయిర్ తో నిజంగా కత్రినా ఒక బొమ్మలాగే ఉంది.  రియల్ బ్యూటీకి మేకప్ ఉన్నా లేకపోయినా ఒకటే అని ఋజువు చేసింది కత్రినా. ఫేస్ లో ఆ ప్లెజెంట్ నెస్ కూడా ఆ పాత్రకు సంబంధించిన లక్షణం అయి ఉంటుంది. ఎప్పుడూ అల్ట్రా మోడరన్ గా బికినీలు.. నెక్స్ట్  జెన్ డ్రెస్సులలో ఉండే కత్రినా ఇలా సింపుల్ గా కనిపించడంతో నెటిజనులు థ్రిల్ అయ్యారు.  జస్ట్ మూడు గంటల్లో 7 లక్షల లైక్స్ కొట్టారు.  సింప్లీ సూపర్బ్ కదా.


Tags:    

Similar News