పవన్ సత్తాకు ఇది నిదర్శనం

Update: 2017-03-19 04:23 GMT
తమిళనాట పెద్ద సినిమాలు భారీ రిలీజ్ అంటే 500-600 మధ్య థియేటర్లలో రిలీజ్ చేస్తారు. మనదగ్గరున్నట్లు తమిళనాడు 2 వేల దాకా స్క్రీన్లు లేవు. అక్కడ మొత్తం కలిపితే వెయ్యి థియేటర్లుంటే ఎక్కువ. అందుకే రజినీకాంత్ సినిమా వస్తే అత్యధికంగా ఓ 800 థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. రజినీ.. సూర్య లాంటి హీరోల సినిమాలు తమిళనాడు కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజవుతుంటాయి. మన తెలుగు సినిమాలకు తమిళ నాట కూడా మంచి ఆదరణే ఉంటుంది కాబట్టి చెన్నై లాంటి చోట్ల మంచి క్రేజ్ మధ్య రిలీజవుతుంటాయి. ఐతే ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ మన సినిమాలకు 50-60 థియేటర్లిస్తే ఎక్కువ.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ తమిళనాట 150 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. ప్రముఖ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ విషయం చెబుతూనే ఆయన ‘మాసివ్ రిలీజ్’ అనే మాట కూడా వాడాడు. దీన్ని బట్టి ‘కాటమరాయుడు’ తమిళ నాట ఎంత పెద్ద స్థాయిలో రిలీజవుతోందో అర్థం చేసుకోవచ్చు. తమిళంలో ఓ చిన్న సినిమా ఏ స్థాయిలో రిలీజవుతుందో.. పవన్ తెలుగు సినిమాను నేరుగా అన్నే థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అందులోనూ ఇది తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. అయినా ఆ ప్రభావం ఏమీ దీని మీద పడలేదు. మరోవైపు కర్ణాటకలోనూ ‘కాటమరాయుడు’ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో కూడా ఈ చిత్రానికి 250కి పైగా స్క్రీన్లు ఇస్తుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News