రావిపూడి - వెంకీ.. మరో క్రేజీ ప్రాజెక్టు
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో ఇటీవల నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.;
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో ఇటీవల నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా.. ఈ ఏడాది సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రిలీజ్ కు ముందే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. వాటిని అందుకుని అదరగొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు మాస్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుని.. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం.. బ్లాక్ బస్టర్ సినిమాకు రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని వినికిడి. అనిల్ రావిపూడితో సీక్వెల్ కు సంబంధించి ఇటీవల చర్చలను దిల్ రాజు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో షూటింగ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఇటు అనిల్ రావిపూడి.. అటు వెంకటేష్.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రావిపూడి.. మన శంకర వరప్రసాద్ గారు మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సమయంలో వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.
ఇప్పుడు ఆ సినిమా పూర్తి అయిన వెంటనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు సంబంధించిన పనులు.. స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను దిల్ రాజుతోపాటు దగ్గుబాటి సురేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నారని తెలుస్తోంది. అయితే సీక్వెల్ పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.