ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తేదీ రివీల్!
`హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాల విషయంలో రిలీజ్ అన్నది ఎలా దోబూచులాట ఆడిందో తెలిసిందే.;
`హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాల విషయంలో రిలీజ్ అన్నది ఎలా దోబూచులాట ఆడిందో తెలిసిందే. రిలీజ్ తేదీ ప్రకటించడం వెనక్కి తగ్గడం ఇలా ఆ రెండు సినిమాల విషయంలో చాలాసార్లు జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కరే బాధ్యడు కాదు. డిలేకి ఆయన ఓ ప్రధాన కారణమై అయినా? ఆయనతో సంబంధం లేని కారణాలు కూడా ఎన్నో తెరపైకి వచ్చాయి. ఆయన డేట్లు ఇచ్చిన సమయంలో షూటింగ్ నిర్వహించలేకపోవడం..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం...టెక్నికల్ సమస్యలు ఇలా చాలానే ఉన్నాయి. చివరికి ఎలాగూ సంవత్సరాలు సాగదీసి ఆ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ పరంగా పెద్దగా డిలే జరగలేదు. మధ్యలో గ్యాప్ వచ్చినా హరీష్ శంకర్ ఆగ్యాప్ ని వేగంతో ఫిల్ చేసాడు. చివరికి ఈ సినిమా షూటింగ్ కూడా క్లైమాక్స్ కు చేరుకుంది. పవన్ కళ్యాణ్ కూడా తన పోర్షన్ పూర్తి చేసి బయటకు వచ్చేసాడు. చిత్రీకరణ పరంగా పవన్ తో పనిలేదు. మళ్లీ డబ్బింగ్..ప్రచారం పనులు మొదలు పెట్టే వరకూ ఉస్తాద్ వైపు పీకే చూడక్కర్లేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడు.
ఇదేమీ భారీ యాక్షన్ సినిమా కాదు. కాబట్టి నిర్మాణానంతర పనులకు పెద్దగా సమయం పట్టదు. గట్టిగా కూర్చుంటే నెల రోజుల్లో పూర్తవుతాయి. దీంతో కాన్పిడెంట్ గా హరీష్ శంకర్ ప్రచారం పనులు కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. దీనిలో భాగంగా లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేయబోతున్నాడు. డిసెంబరులో అభిమానులకు పెద్ద ట్రీట్ ఉంటుందని కొన్ని రోజుల ముందే ఓ పోస్ట్ తో హింట్ ఇచ్చాడు. ఆ ట్రీట్ లిరికల్స్ రిలీజ్ చేయడమా? లేక అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడా? అన్నది తెలియాలి.
గ్లింప్స్ లేదా టీజర్ లాంటిది వదులుతాడని అభిమానులు గెస్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో కొన్ని గంటల క్రితమే మరోసారి సంబరాలకు సిద్దమవ్వండని అన్నాడు. దీంతో డైరెక్ట్ గా రిలీజ్ తేదీ చెబుతున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఉన్నా? వేసవిలోనే సాధ్యమవుతుంది. పిబ్రవరి , మార్చి ఎలాగూ పరీక్షల సీజన్. అప్పుడు పెద్దగా రిలీజ్ లుండవు. ఈనేపథ్యంలో ఏప్రిల్ లో ఉస్తాద్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.