ఆ స్టార్ హీరో సౌత్ మొత్తాన్ని రౌండప్ చేస్తున్నాడే!

కోలీవుడ్ స్టార్ సూర్య ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో తెలిసిందే. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.;

Update: 2025-12-07 19:15 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో తెలిసిందే. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. `కంగువ` త‌ర్వాత రిలీజ్ అయిన `రెట్రో` కూడా ప్లాప్ అయింది. ప్ర‌యోగాలు ప‌క్క‌న బెట్టి కొన్నాళ్ల పాటు క‌మ‌ర్శియ‌ల్ స్టార్ గానే ఎలివేట్ అవ్వాల‌ని డిసైడ్ అయిన సూర్య కి `రెట్రో` నిరాశ‌నే మిగిల్చింది. ఇప్ప‌టికే ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న `క‌రుప్పు` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ఆ సినిమా రిలీజ్ కా నుంది. అలాగే సూర్య 46వ చిత్రం కూడా బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.




తెలుగు సినిమాపై కాన్పిడెంట్ గా:

ఇదీ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. సూర్య మార్క్ ఊర మాస్ఎంట‌ర్ టైన‌ర్ ఇది. 47వ సినిమాతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. ఇంత వ‌ర‌కూ వెంకీకి ప్లాప్ లేదు. దీంతో ఈ సినిమా సూర్య‌కి బెస్ట్ లాంచింగ్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సూర్య కూడా ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడు. తాజాగా ఇదే స‌రైన స‌మ‌యంగా భావించి మాలీవుడ్ మార్కెట్ లోకి సూర్య ఎంట‌ర్ అవుతున్నాడు.`ఆవేశం` ఫేం జితు మాధవన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు.

సౌత్ ని రౌండ‌ప్ చేసాడా?

తాజాగా ఆ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఇందులో సూర్య‌కు జోడీగా న‌జ్రియా న‌జీమ్ న‌టిస్తుంది. ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సూర్య‌, న‌జ్రియా స‌హా ద‌ర్శ‌కుడు ఇత‌ర టీమ్ అంతా పిక్ లో చూడొచ్చు. మొత్తానికి సూర్య సౌత్ లో పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగుతున్న‌ట్లు చెప్పొచ్చు. ఇంత వ‌ర‌కూ కోలీవుడ్ కే ప‌రిమిత‌మైన అత‌డి మార్కెట్ ను సౌత్ మొత్తం విస్త‌రించే ప్లాన్ లో భాగంగా ఆయా భాష‌ల్లోకి ఎంట‌ర్ అవ్వ‌డం శుభ‌ప‌రిణామం గా చెప్పొచ్చు.

ఒకే ఏడాది రెండు భాష‌ల్లో:

తెలుగు హీరోలంతా పాన్ ఇండియా అంటూ నార్త్ సహా , విదేశీ మార్కెట్ పై దృష్టి పెడితే? సూర్య అందుకు భిన్నంగా రీజ‌న‌ల్ గా స్ట్రాంగ్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. తెలుగు ఆడియ‌న్స్ కు సూర్య కొత్తేం కాదు. ఎన్నో అనువాద చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. అత‌డికి ఇక్క‌డ ప్ర‌త్యేక‌మైన ప్యాన్ బేస్ ఉంది. కానీ మాలీవుడ్, శాండిల్ వుడ్ కి మాత్రం ఇంకా రీచ్ అవ్వ‌లేదు. ఇప్పుడా ప్ర‌య‌త్నాలు షురూ చేసాడు. త్వ‌ర‌లో క‌న్న‌డ‌లో కూడా ఎంట‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. మాలీవుడ్ లో మొద‌లు పెట్టిన చిత్రం కూడా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ఏడాది వెంకీ అట్లూరి సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News