ఎన్టీఆర్ కోసం ఆ బాలీవుడ్ బ్యూటీ దిగుతోందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే బాక్సాఫీస్ దగ్గర వైబ్రేషన్స్ మొదలవుతాయి.;

Update: 2025-12-07 22:30 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే బాక్సాఫీస్ దగ్గర వైబ్రేషన్స్ మొదలవుతాయి. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవెల్ లో ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ ఎలాంటి కథతో వస్తున్నాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన చిన్న చిన్న లీక్స్ సినిమా రేంజ్ ఏంటో హింట్ ఇచ్చాయి.

అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒక కొత్త రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక బెంచ్ మార్క్ మూవీగా నిలబెట్టాలని ప్రశాంత్ నీల్ కసితో పని చేస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ విషయంలో చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేస్తున్నారట. నీల్ ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా, ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్.

అయితే ఈ కథలో ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ కూడా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ గెస్ట్ రోల్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. కథ మలుపు తిరిగే కీలక సమయంలో ఈ పాత్ర ఎంట్రీ ఇస్తుందని సమాచారం. నిడివి తక్కువే అయినా, ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉండేలా ఈ క్యారెక్టర్ ను రాసుకున్నారని టాక్.

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను సంప్రదించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఆమె నటన, స్క్రీన్ ప్రెజన్స్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయని నీల్ ఫిక్స్ అయ్యారట. ఒకవేళ కాజోల్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ వెండితెరపై సంచలనం సృష్టించడం ఖాయం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయట. నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం పక్కా.

కాజోల్ ఎంట్రీ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ ఈ రూమర్ మాత్రం సినిమాపై బజ్ ను మరింత పెంచేసింది. షూటింగ్ దశలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్, రిలీజ్ టైమ్ కి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Tags:    

Similar News