కొత్త చరిత్ర.. కంప్లీట్ తెలుగు AI మూవీకి మిలియన్ వ్యూస్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వాడకం అన్ని రంగాల్లో బాగా పెరిగిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కూడా వివిధ డిపార్ట్మెంట్లలో యూజ్ చేస్తున్నారు.;

Update: 2025-12-07 19:09 GMT

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వాడకం అన్ని రంగాల్లో బాగా పెరిగిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కూడా వివిధ డిపార్ట్మెంట్లలో యూజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ నిర్మాత.. తన వద్ద ఒక స్టోరీ లైన్ తో ఏకంగా ఫుల్ స్క్రిప్ట్ ను ఏఐ ద్వారా రెడీ చేశారని వార్తలు వచ్చాయి. వెంటనే ఓ హీరోయిన్ కు చెప్పి ఓకే కూడా చేయించుకున్నారట.

అయితే ఏఐ కథలు చెప్పడం మాత్రమే కాదు.. సినిమాల్ని సృష్టించే స్థాయికి చేరిందనే దానికి ఉదాహరణగా నిలుస్తోంది ఏఐ లవ్ స్టోరీ (తెలుగు) 4K. పూర్తిగా AI‌తో రూపొందించిన ఆ తెలుగు ఫీచర్ ఫిల్మ్ యూట్యూబ్‌ లో నెల రోజుల క్రితం అందుబాటులో రాగా.. ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యూస్ సంపాదించుకుని దూసుకుపోతోంది.

ఇప్పటి వరకు 10 లక్షల వ్యూస్ కు పైగా అందుకోగా.. ప్రస్తుతం ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. డిజిటల్ సినీ ప్రపంచంలో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే స్టార్లు లేరు.. సెట్లు లేవు.. షూటింగ్ జరగలేదు.. కానీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఇది విశేషమనే చెప్పాలి.

అయితే ఏఐ లవ్ స్టోరీ మూవీ.. కమర్షియల్ గానే రూపొందించిందే కాదు.. ప్రయోగాత్మకమైన ప్రాజెక్ట్ కూడా.. దర్శకుడి తన కథను, విజన్‌ ను స్పష్టంగా చూపించారు. నిర్మాత ప్రయోగాలకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే వ్యక్తి అని అనిపించుకున్నారు. కాగా, ఆ సినిమాకు దివ్య తేజ కోట్లపాటి నిర్మాతగా వ్యవహరించారు. అలాంటి ప్రాజెక్టుకు ఫైనాన్సియల్ సపోర్ట్ చేయడం మామూలు విషయం కాదు.

పూర్తిగా AI ఆధారంగా రూపొందే సినిమాపై ఇన్వెస్ట్ చేసిన ఆమె.. కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీకి పరిచయం చేసే వ్యక్తిత్వంతో ఉన్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అలాంటి వారి వల్లే సినిమా రంగంలో కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. అయితే AI‌తో రూపొందించినా సినిమాకు మెయిన్ సోల్ దర్శకుడు MuVeRa.

ఎందుకంటే AI ఎంత పవర్ ఫుల్ అయినా కథను ఏ దిశలో తీసుకెళ్లాలి? ఏం చూపాలి? ఏం చూపించకూడదు? ఎమోషన్స్ ఎలా పండించాలి? అన్నింటికీ మాత్రం హ్యూమన్ పవర్ అవసరమని MuVeRa ఇప్పుడు ప్రూవ్ చేశారు. టెక్నాలజీ సహాయపడుతుందే కానీ సినిమా రూపొందించేది మనుషులేనని మరోసారి నిరూపించారు.

అయితే ఇప్పుడు ఆడియన్స్.. ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా.. ఫ్యూచర్ ఏ దిశలో పోతుందన్న ఇంట్రెస్ట్ తో ఏఐ లవ్ స్టోరీ 4k మూవీని చూస్తున్నారు. AIతో ఫీచర్ ఫిల్మ్ రూపొందించగలమా అనే ఆసక్తితో కూడా వీక్షిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏఐ లవ్ స్టోరీ 4K.. సినీ ఇండస్ట్రీతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News