ఈ తెలుగు హీరోలైనా పూజా హెగ్డేను కాపాడుతారా?
ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు 2025 సంవత్సరం అంతగా కలిసి రాలేదు. సూర్యతో కలిసి చేసిన 'రెట్రో' ఆశించిన విజయాన్ని అందించకపోగా, రజనీకాంత్ 'కూలీ' చిత్రంలో కేవలం ఒక సాంగ్ కే పరిమితమైంది.;
వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరెట్ విక్టరీ వెంకటేశ్ కలయికలో ఇప్పటికే 'F2', 'F3' 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరికీ తోడుగా దగ్గుబాటి వారసుడు రానా కూడా జతకట్టడం టాలీవుడ్‌లో అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతికి సక్సెస్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను కూడా తన కామెడీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కొల్లగొట్టాలని అనిల్ గట్టి ప్లాన్ వేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ యాడ్ చేయడానికి పూజా హెగ్డేను హీరోయిన్‌గా పరిశీలిస్తుండటం అంచనాలను మరింత పెంచేస్తోంది.
అనిల్ సినిమాతోనే మళ్ళీ ఫామ్‌లోకి?:
ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు 2025 సంవత్సరం అంతగా కలిసి రాలేదు. సూర్యతో కలిసి చేసిన 'రెట్రో' ఆశించిన విజయాన్ని అందించకపోగా, రజనీకాంత్ 'కూలీ' చిత్రంలో కేవలం ఒక సాంగ్ కే పరిమితమైంది. ఇప్పుడు ఆమెకు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ఎనర్జిటిక్ గా, కామెడీ టైమింగ్‌తో ఉంటాయి. గతంలో అనిల్ సినిమాలో ఓ పాట లో మెరిసిన పూజాకు, ఇప్పుడు వెంకీ-రానా వంటి పవర్‌హౌస్ యాక్టర్లతో ఛాన్స్ దొరికితే ఆమె కెరీర్ మళ్ళీ స్పీడ్ అందుకోవడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే పూజా మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఈ తెలుగు హీరోలైనా పూజా హెగ్డే కు మంచి హిట్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి:
వెంకటేశ్ క్లాస్ కామెడీ, రానా మాస్ ఇంటెన్సిటీ.. ఈ రెండింటిని అనిల్ రావిపూడి తన స్టైల్ లో ఎలా మిక్స్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి సెంటిమెంట్ అనిల్ కు బాగా కలిసి వచ్చింది. ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు 350 కోట్లు పైన కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అనిల్ నెక్స్ట్ తీసే ఈ మల్టీస్టారర్ చిత్రం ద్వారా వినోదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పూజా హెగ్డే కూడా ఈ టీమ్‌లో చేరితే, వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద 'దగ్గుబాటి' హీరోల హంగామా మామూలుగా ఉండదు. అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ రాదు, కానీ ప్రస్తుతానికైతే ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.