ఇప్పటికైనా వారిని చూసి నేర్చుకుంటే బెటర్
ప్రమోషన్స్ అనేవి సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.;
ఎలాంటి సినిమాకైనా ప్రమోషన్లు ఎంత గొప్పవనేది ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో స్వయంగా చెప్పారు. ఏ సినిమా అయినా రిలీజయ్యే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఒకసారి సినిమా రిలీజయ్యాక మనమెంత కష్టపడినా ఎలాంటి ఉపయోగముండదని కూడా ఆయన చెప్తుంటారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఆయన చాలా కష్టపడుతుంటారు.
ప్రమోషన్స్ అనేవి సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ప్రమోషన్స్ బాగా చేయడం వల్ల హిట్ సినిమాలు సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలుంటే, హిట్ సినిమాలు కూడా సరైన ప్రమోషన్స్ లేక యావరేజ్ గా మిగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమా తీయడం ఒకెత్తయితే దాన్ని ప్రమోట్ చేయడం మరోక ఎత్తు.
ప్రమోషన్స్ విషయంలో జక్కన్న స్పెషల్
సినిమాను తీసిన తర్వాత దాన్ని కింది స్థాయి ఆడియన్స్ వరకు తీసుకెళ్లాలంటే దానికున్న ఏకైక మార్గం ప్రమోషన్స్. అయితే ఈ ప్రమోషన్స్ ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసి తమ సినిమాలకు హైప్ పెంచుకుంటూ ఉంటారు. ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అందరికంటే ఓ అడుగు ముందుంటారు. సినిమా కోసం కథ, కథనం విషయంలో జక్కన్న ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో ప్రమోషన్స్ విషయంలో కూడా ఆయనంతే పర్టిక్యులర్ గా ఉంటారు.
ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ఏ మాత్రం ఆలోచించకుండా దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. వాస్తవానికి రాజమౌళికి ప్రపంచ స్థాయిలో ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే చూడ్డానికి ఆడియన్స్ అంతా రెడీగా ఉంటారు. అయినా సరే తన సినిమాలకు రాజమౌళి చేసే ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయనే విషయం తెలిసిందే.
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా ఆయన ప్లాన్ చేసే ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. కేవలం తను మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలు చేసే ప్రతీ ఒక్కరు కూడా ప్రమోషన్స్ లో పాల్గొనేలా చేసి సినిమాను ఆడియన్స్ వద్దకు తీసుకెళ్లి, తన సినిమాకు భారీ ఓపెనింగ్స్ ను అందుకుంటారు రాజమౌళి. అంతటి క్రేజ్ ఉన్న రాజమౌళినే సినిమా ప్రమోషన్స్ విషయంలో అంత తాపత్రయపడుతున్నారంటే ప్రమోషన్స్ విలువేంటనేది ఇప్పటికైనా అందరికీ అర్థమవాలి. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి కూడా తూ.చ తప్పకుండా పాటిస్తూ తన సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ మంచి కలెక్షన్లు అందుకుంటూ హిట్ల మీద హిట్లు కొట్టి కెరీర్లో దూసుకెళ్తున్నారు. వీరిని చూసైనా ప్రమోషన్స్ లో సరిగా పాల్గొనని నటీనటులు, డైరెక్టర్లు ఇప్పటికైనా నేర్చుకుంటే బావుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.