• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కసితో ఖర్చు పెడుతున్నారా...

కసితో ఖర్చు పెడుతున్నారా ఏంటి ?

By - Tupaki Desk
Update: 2018-04-27 14:30 GMT
బాహుబలి 2 విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ మేకర్స్ కు దాని విజయం పట్ల కంటగింపు ఉంది అన్నది పచ్చి నిజం. ఎందుకంటే ఒక దక్షిణాది సినిమా హిందిలో చరిత్ర  సృష్టించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు దాని చూడటం కాదు కదా కనీసం మెచ్చుకునే చొరవ కూడా చూపలేకపోయారు. అయినా ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. కాని తమిళ్ హింది బాషలలో ఎలాగైనా బాహుబలిని మించే సినిమా తీయాలనే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తమిళ్ లో గతంలో పులి లాంటి సినిమా వస్తే కన్నడలో కురుక్షేత్ర అనే మూవీ నిర్మాణంలో ఉంది. హిందీలో తానేమి తక్కువ తినలేదు టైపులో కరణ్ జోహార్ కూడా ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. దాని పేరే కలంక్.

వరుణ్ ధావన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సంజయ్ దత్ మాధురి దీక్షిత్ లాంటి సీనియర్ స్టార్లు కూడా ఉన్నారు. స్వాతంత్రం రాకముందు జరిగిన నేపధ్యాన్ని తీసుకుని దర్శకుడు అభిషేక్ వర్మ దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. సోనాక్షి సిన్హా  మరో హీరొయిన్ గా నటిస్తోంది. ముంబై ఫిలిం సిటీలో పాత కాలం నాటి రాజ మహల్ ను తలపించే సెట్ ఒకటి సుమారు 15 కోట్లకు పైగా ఖర్చుతో వేసినట్టు బాలీవుడ్ మీడియా టాక్. కాని వాటి తాలూకు ఫోటోలు కాని వీడియోలు ఎక్కడా లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అమ్రితా మహాల్ నేతృత్వంలో ఆర్ట్ వర్క్ జరుగుతోంది.

ఈ కలంక్ ఖచ్చితంగా బాహుబలిని టార్గెట్ చేసే తీస్తున్నారు అని అక్కడి మీడియా కథనం. ఒక రీజనల్ సినిమానే అంత సత్తా చాటినప్పుడు హింది మూవీ రేంజ్ ఏంటో చూపించాలనే తాపత్రయంలో కరణ్ జోహార్ కసి మీద ఉన్నట్టు తెలిసింది. బాహుబలికి హింది నిర్మాత కరణ్ జోహారే అయినప్పటికీ అతని కంటే ఎక్కువ క్రెడిట్ ప్రభాస్ రాజమౌళి కొట్టేసారు. అప్పటి నుంచి కాస్త కినుకుగా ఉన్న కరణ్ ఎలాగైనా దీంతో కొడతాను అంటున్నాడట. అయినా కసితో కాదు కంటెంట్ తో తీసే ఏ సినిమా అయినా విజయం సాధించకుండా ఉంటుందా.
Tags:    
  • Karan Johar 
  • Expensive set 
  • Kalank 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS