వారివల్ల నాలో నూతన శక్తి మొదలవుతుంది
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవ పిల్లలకు తండ్రి అయిన విషయం తెల్సిందే. ఆ పిల్లలే జీవితంగా కరణ్ జోహార్ జీవితంను గడుపుతున్నాడు. తాజాగా ఆ పిల్లలు మూడవ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పిల్లల పుట్టిన రోజు సందర్బంగా కరణ్ జోహార్ కాస్త ఎమోషనల్ గా సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. తన తల్లి మరియు పిల్లల వల్ల తాను పొందుతున్న సంతోషం ను ఆ పోస్ట్ లో వివరించడం తో ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
కరణ్ ఆ పోస్ట్ లో.. జనాలు నన్ను సింగిల్ ఫాదర్ అనుకుంటారు.. పిల్లలకు తల్లి లేదని అనుకుంటారు. కాని నా తల్లి నా పిల్లలకు తల్లిగా మారింది. వారికి కావాల్సినవన్నీ కూడా నా తల్లి చూసుకుంటుంది. వారికి తల్లిలేని లోటును నా తల్లి తీర్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మద్దతు లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేనంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రూహీ ఇంకా యష్ ల రాకతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. వారు వచ్చిన తర్వాత ప్రతి రోజు నాలో నూతన శక్తి మొదలవుతుంది. వారితో గడిపిన ప్రతి క్షణం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. వారు వచ్చిన తర్వాత మా ఇంట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మా కుటుంబం సంపూర్ణం అయ్యిందంటూ కరణ్ కొడుకుల గురించి చెప్పుకొచ్చాడు. రూహీ.. యష్ లకు బాలీవుడ్ ప్రముఖుల నుండే కాకుండా కరణ్ జోహార్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.