పులి కడుపున పిల్లి పుడుతుందా? మోహన్‌లాల్ కుమార్తె నటనపై ప్రశంసలే ప్రశంసలు!
మలయాళ చిత్ర పరిశ్రమలో `లాలేట్టన్`గా ఆప్యాయంగా పిలుచుకునే సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తే విస్మయా మోహన్‌లాల్.
మలయాళ చిత్ర పరిశ్రమలో `లాలేట్టన్`గా ఆప్యాయంగా పిలుచుకునే సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తే విస్మయా మోహన్‌లాల్. విస్మయ లేదా మాయా మోహన్‌లాల్ గా సుపరిచితురాలు. ఈమె మోహన్‌లాల్‌కి నిజంగానే సొంత కుమార్తె. మోహన్‌లాల్ ఆయన సతిమణి సుచిత్ర దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ కాగా, చిన్న కుమార్తె విస్మయ. ప్రణవ్ ఇప్పటికే మలయాళంలో కథానాయకుడిగా నిరూపించుకోగా, విస్మయ ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
విస్మయ తండ్రి మోహన్‌లాల్ భారతీయ చిత్రసీమలోనే అత్యంత ప్రభావవంతమైన గొప్ప నటులలో ఒకరు. ఐదు పదుల కాలంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న ఆయన ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. తండ్రి సినీ రంగంలో అంతటి అపారమైన ప్రజాదరణ పొందినా.. విస్మయ చిన్నతనం నుండి గ్లామర్ ప్రపంచానికి, మీడియా దృష్టికి దూరంగానే పెరిగారు.
తండ్రి వారసత్వంతో సంబంధం లేకుండా విస్మయ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. రచయిత్రి, కవి, ఆర్టిస్ట్ కూడా. 2021లో `గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్` పేరుతో తన కవితలు, వర్ణచిత్రాల సమాహారంతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. తండ్రి మోహన్‌లాల్ కూడా తన కుమార్తె సృజనాత్మకతను చూసి ఎంతో గర్వపడ్డారు.
రచనలతో పాటు విస్మయకు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. థాయిలాండ్‌లో కఠినమైన శిక్షణ తీసుకుని `ముయ్ థాయ్` అనే సమరకళలో నైపుణ్యం సాధించారు. ఫిట్‌నెస్, యాక్షన్ కళలపై ఆమెకున్న ఆసక్తే ఇప్పుడు సినీ ప్రవేశానికి పునాదిగా మారింది.`తుడక్కమ్` అనే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న చిత్రం ద్వారా విస్మయ కథానాయికగా పరిచయమై తన యాక్షన్ నైపుణ్యాలతో విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సినిమా కుటుంబం నుంచి వచ్చినా విస్మయ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా ముందుకు సాగుతున్నారు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక.. తన తండ్రి పేరును నిలబెట్టేలా నటనలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. సూపర్ స్టార్ మోహన్‌లాల్ వారసురాలిగా, తన సొంత ప్రతిభతో వెండితెరపై ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నారు.