ప‌బ్లిగ్గా డీప్ లిప్‌లాక్ వేసిన ఫ్యాన్.. హీరోయిన్ అవాక్కు!

అభిమానం హ‌ద్దులు మీరితే ఎలా ఉంటుందో ఈ లిప్ లాక్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఆ అభిమాని అనాలోచితంగా బుగ్గ‌పై ముద్దు పెట్టి వ‌దిలేయ‌లేదు.

Update: 2026-08-10 03:55 GMT

అభిమానం హ‌ద్దులు మీరితే ఎలా ఉంటుందో ఈ లిప్ లాక్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఆ అభిమాని అనాలోచితంగా బుగ్గ‌పై ముద్దు పెట్టి వ‌దిలేయ‌లేదు. వెంట‌నే పెద‌వి ముద్దును లాగించేసింది. ఓవైపు ఆ న‌టి కంగారు ప‌డుతున్నా వ‌దిలి పెట్ట‌క బ‌ల‌వంతంగా లిప్ లాక్ వేసేసి వేదిక వ‌ద్ద ఉన్నవారంద‌రినీ షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా అభిమాని వేసిన లిప్ లాక్ కి ఊపిరాడ‌క స‌ద‌రు న‌టి చాలా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. త‌న పెద‌వుల‌ను తుడుచుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూస్తున్న‌వారంద‌రికీ ఒక‌టే షాక్ లు..

ఇదంతా హిందీ న‌టి నికితా రావల్ అనుభ‌వం. ఈ ప్ర‌ముఖ న‌టికి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ఈవెంట్‌లో విదేశీ మహిళ నటి నికితా రావల్‌ను హఠాత్తుగా పెదవులపై ముద్దు పెట్టుకోవడం... దానికి నికితా తీవ్ర అసౌకర్యానికి, దిగ్భ్రాంతికి గురికావడం ఆ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాక.. లైంగిక వేధింపుల కోణంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్ల నుంచి విభిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఇలా ప్రవర్తించడం ముమ్మాటికీ లైంగిక వేధింపుల కిందకే వస్తుంది! అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు ఎంత మానసిక క్షోభకు గురైందో త‌న‌ ముఖకవళికలు చెప్తున్నాయని.. వేధింపులకు పాల్పడిన మహిళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేకమంది కామెంట్లు చేశారు.

అయితే ఈ వీడియోపై మెజారిటీ యూజర్లు మరో కోణంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పీఆర్ గిమిక్కుల్లో ఇది కూడా ఒక భాగమని చాలామంది కామెంట్ చేశారు. వార్తల్లో నిలవడానికి ఈ మధ్య ఇదొక ట్రెండ్‌గా మారింది..ఇది పక్కా ప్లాన్ చేసి చిత్రీకరించిన డ్రామా! అంటూ పలువురు నెటిజన్లు పెదవి విరిచారు. పోస్ట్ చేసిన యూజర్ కూడా మొదట దీన్ని చూసి షాక్ అయినా కామెంట్లలో చర్చను చూసి ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ ఘటన స్క్రిప్టెడ్ కాదా అనే విషయం పక్కన పెడితే.. ఇటువంటి చర్యలు పబ్లిసిటీ కోసం ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సమాజంలో లైంగిక వేధింపులు, అనుమతి లేని స్పర్శ వంటి తీవ్రమైన అంశాలను తేలికచేసి చూపేలా ఇటువంటి పబ్లిసిటీ స్టంట్స్ ఉండటం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైన ఘటన అయితే నటి వెంటనే పోలీసులను ఆశ్రయించి చట్టపరంగా ముందుకెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు.




Tags:    

Similar News