`ఒక వెర్రి మాజీ` అంటూ స్టార్ హీరోని పదే పదే తీసిపారేస్తోంది!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై క్వీన్ కంగన ఫికర్ గురించి తెలిసినదే. కొన్నేళ్లుగా కంగన-రంగోలి సిస్టర్స్ రోషన్ లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ తనని ప్రేమించి వంచించాడని ఇంతకుముందు కంగన ఆరోపించింది. అతడితో సుదీర్ఘమైన మెయిల్స్ సంభాషణల్ని పంపించింది.
రకరకాల ఈమెయిల్స్ తో తనని తీవ్రంగా వేధించిందని హృతిక్ ఆరోపించారు. నటి కంగనా రనౌత్ పై 2016 లో కేసు ఫైల్ చేశాడు. దీనికి సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అతడి వాంగ్మూలాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ రికార్డ్ చేసే అవకాశం ఉందని ఈ విషయం తెలిసిన అధికారులు తెలిపారు. హృతిక్ ను నేడు (ఫిబ్రవరి 27న) పోలీసులు పిలిపించారట.
ఒక నివేదిక ప్రకారం.. కంగనా పూర్తి పేరును కలిగి ఉన్న ఇమెయిల్ చిరునామాల నుండి హృతిక్ కు పంపిన 950 ఈమెయిళ్ళను దర్యాప్తులో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 350 మంది పోలీసుల స్కానర్ కింద ఉన్నారట.
కంగనపై కేసులో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున హృతిక్ రోషన్ పై మరోసారి `సిల్లీ ఎక్స్` అంటూ కామెంట్ చేసింది. దీనర్థం `ఒక వెర్రి మాజీ` అని. ప్రస్తుతం కంగన ఎలాంటి భయం లేకుండా కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. హృతిక్ ను క్రైమ్ బ్రాంచ్ శనివారం పిలిచినట్లు పత్రికల్లో ప్రచురితం కాగా.. ఆ క్లిప్పింగుపై కంగన ట్విట్టర్ లో స్పందిస్తూ,... “దునియా కహన్ సే కహాన్ పహుంచ్ గేయి మాగర్ మేరా సిల్లీ ఎక్స్ అభి భీ వహీన్ హై ఉసి మోడ్ పె జహాన్ యే వక్త్ డోబారా లాట్ కే నహి జనే వాలా ( sic). ” అంటూ వ్యాఖ్యానించింది.
కంగన తనకు వందలాది ఇమెయిల్స్ పంపడం ద్వారా తనను వేధించిందని హృతిక్ ఇదివరకూ ఆరోపించారు. దీనిపై ఇప్పటికి విచారణ పరిపూర్ణంగా సీరియస్ గా సాగుతోందని అర్థమవుతోంది.