వంశీ పైడిప‌ల్లి మూవీ ఆర్టిస్ట్‌ల పారితోషికాలు ఎంత‌?

వంశీ పైడిప‌ల్లి..అసిస్టెంట్ డైరెక్ట‌ర్ స్టేజ్ నుంచే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచిన వ్య‌క్తి. బెంజ్ కారులో షూటింగ్ స్పాట్‌కు వ‌స్తూ హీరోలు సైతం త‌న గురించి చ‌ర్చించుకునేలా చేశారు.;

Update: 2026-04-04 06:42 GMT

వంశీ పైడిప‌ల్లి..అసిస్టెంట్ డైరెక్ట‌ర్ స్టేజ్ నుంచే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచిన వ్య‌క్తి. బెంజ్ కారులో షూటింగ్ స్పాట్‌కు వ‌స్తూ హీరోలు సైతం త‌న గురించి చ‌ర్చించుకునేలా చేశారు. ఆ త‌రువాత `మున్నా`ని ప్ర‌భాస్‌తో చేసి డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన వంశీ పైడిప‌ల్లి జ‌ర్నీ `వార‌సుడు` వ‌ర‌కు సాఫీగానే సాగింది. ఇక్క‌డి నుంచే అస‌లు ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. ఈ మూవీ త‌రువాత తెలుగులో ఒక్క హీరో కూడా అందుబాటులో లేక‌నోవ‌డంతో గ‌త మూడేళ్లుగా హీరో కోసం అన్వేషించ‌డం మొద‌లు పెట్టారు.

తెలుగు స్టార్లు అంతా పాన్ ఇండియా రేసులో ప‌రుగులు పెడుతుండ‌టం, ఏ ఒక్క‌రు కూడా వంశీ పైడిప‌ల్లికి అందుబాటులో లేక‌పోవ‌డంతో ఫైన‌ల్‌గా బాలీవుడ్ హీరోని ప‌ట్టేశారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌పైకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్‌కు స్టోరీ న‌రేట్ చేయ‌డ‌మే కాకుండా జెట్ స్పీడుతో ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని కూడా స్టార్ట్ చేశారు.

అంతే కాకుండా ఈ మూవీ కోసం రేర్ కాంబినేష‌న్‌ల‌ని సెట్ చేస్తుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తుండ‌గా, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార త‌న‌కు జోడీగా న‌టించ‌నుంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేసి ప్రాజెక్ట్‌పై హైప్‌ని పెంచేశారు. ఇక వీరితో పాటు ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ అనిల్ క‌పూర్‌, కోలీవుడ్ స్టైలిష్ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి న‌టించ‌నున్నారు.

ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్‌కు ఈ మూవీ కోసం రూ.120 కోట్లు పారితోషికం ఇస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్న వేళ ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ ఆర్టిస్ట్‌ల పారితోషికాల‌పై నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. దిల్‌రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న క్రేజీ ఆర్టిస్ట్‌ల‌కు ఎంతెంత పారితోషికం ఇస్తున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ల్మాన్ ఖాన్ పారితోషికం బ‌య‌టికి రావ‌డంతో మిగ‌తావారి పారితోషికాలు ఎంత అనే చ‌ర్చ మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలోనే లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కు రూ.10 కోట్లు ఇస్తున్నార‌ని, అనిల్ క‌పూర్‌కు కూడా అతే ఇస్తున్నార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే `ధృవ‌`లో స్టైలిష్ అండ్ ఇంట‌లిజెంట్ విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామికి మాత్రం రూ.15 కోట్లు ఇస్తున్నార‌ని చెబుతున్నారు. న‌య‌న‌తార‌, అనిల్ క‌పూర్ కంటే రూ.5 కోట్లు ఎక్కువ‌న్న‌మాట‌. స‌ల్మాన్ ఖాన్ పారితోషికంతో పాటు కీల‌క న‌టీన‌టుల రెమ్యూన‌రేష‌న్‌ని లెక్కేస్తే రూ.155 కోట్లు. మ‌రి సినిమాకు ఎంత బ‌డ్జెట్ పెడుతున్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News