నాని స్పీడ్ తగ్గిందా? పాన్ ఇండియా రేస్‌లో బ్రేక్ పడిందా?

సినిమా ఇండస్ట్రీ అయినా, కార్పొరేట్ ప్రపంచం అయినా.. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నప్పుడు వరుసగా ప్రాజెక్టులు సైన్ చేయడం సులభమే కానీ, వాటిని సకాలంలో డెలివరీ చేయడమే అసలైన సవాలు.

Update: 2026-07-05 02:30 GMT

సినిమా ఇండస్ట్రీ అయినా, కార్పొరేట్ ప్రపంచం అయినా.. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నప్పుడు వరుసగా ప్రాజెక్టులు సైన్ చేయడం సులభమే కానీ, వాటిని సకాలంలో డెలివరీ చేయడమే అసలైన సవాలు. ప్రస్తుతం టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే ఈ 'టైమ్ మేనేజ్‌మెంట్' సవాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదికి కనీసం మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ మోస్ట్ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఎప్పుడూ లేని విధంగా సినిమా సినిమాకు గ్యాప్ పెంచడం ఇప్పుడు అభిమానులను కాస్త కంగారు పెడుతోంది.

టైమ్ మేనేజ్‌మెంట్‌లో 'డోమినో ఎఫెక్ట్':

ఒకే హీరో నైపుణ్యంపై ఆధారపడి రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు లైన్లో ఉన్నప్పుడు, ఒక పెద్ద సినిమా అనుకోకుండా ఆలస్యమైతే దాని ప్రభావం మిగతా వాటిపై కూడా పడి మొత్తం షెడ్యూల్ అనిశ్చితిలోకి వెళ్ళిపోతుంది. ఇక దీనినే మేనేజ్‌మెంట్‌లో 'డోమినో ఎఫెక్ట్' అంటారు. ప్రస్తుతం నాని కెరీర్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఒకే ఒక్క భారీ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం వల్ల నాని అమూల్యమైన సమయం అంతా వృథా అయిపోతోంది.

'ది ప్యారడైజ్' తెచ్చిన ఆలస్యం:

కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' కోసం నాని ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇక గ్లోబల్ మార్కెట్‌లో జెండా పాతాలనే నమ్మకంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ భారీ వెంచర్ వల్ల షూటింగ్ బాగా ఆలస్యమైంది. ఇక సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతున్నా, యూనిట్ నుండి ఇప్పటికీ ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

పెండింగ్‌లో పడ్డ 'బ్లడీ రోమియో':

'ది ప్యారడైజ్' డిలే అవ్వడం వల్ల నాని తదుపరి ప్రాజెక్టులపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. గతంలో దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో ఎంతో గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఈలోగా పవన్ కళ్యాణ్ 'ఓజి 2' ప్రచారం ఊపందుకోవడం, స్వయంగా ఆయనే ట్వీట్లు పెట్టడంతో సుజిత్ అక్కడ బిజీ అయిపోయాడు. ఇక దీంతో నాని 'రోమియో' ప్రస్తుతానికి పెండింగ్‌లో పడిందనే అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి.

రేసులోకి వచ్చిన కోలీవుడ్ డైరెక్టర్:

ఇదిలా ఉంచితే, ఇటీవలే హీరో అర్జున్‌తో 'బ్లాస్ట్ జోన్' రూపంలో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ దర్శకుడు సుభాష్ కె రాజ్ ఇప్పుడు నాని కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టు చెన్నై టాక్. కేవలం లిమిటెడ్ లొకేషన్లు తక్కువ బడ్జెట్‌తో గ్రిప్పింగ్ నేరేషన్‌తో తెరకెక్కిన 'బ్లాస్ట్ జోన్' థియేటర్ల నుండి ఏకంగా 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక నానిని ఈ దర్శకుడు ఇటీవలే కలిసి కథ వినిపించాడని సమాచారం.

నాని ముందరి రెండు దారులు:

ప్రస్తుత పరిస్థితుల్లో నాని ముందర రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, 'ది ప్యారడైజ్' ఆలస్యం అవుతున్న సమయంలో, ఆ గ్యాప్‌ని కవర్ చేయడానికి సుభాష్ రాజ్ లాంటి తక్కువ బడ్జెట్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మునుపటి వేగాన్ని అందుకోవడం. లేదా రూమర్స్ కి తావివ్వకుండా తన పెండింగ్ ప్రాజెక్టులపై ఒక రూట్ తో ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వడం.

పాన్ ఇండియా వేటలో పడ్డాక వర్క్ స్పీడ్ ఆటోమేటిక్‌గా తగ్గడం సహజమే అయినా, నాని లాంటి స్పీడ్ ఉన్న హీరో ఏడాది దాటినా ఒక్క రిలీజ్ కూడా ఇవ్వకపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ క్రైసిస్ నుండి బయటపడటానికి న్యాచురల్ స్టార్ ఎలాంటి ప్లాన్ వేస్తాడో చూడాలి. ఇక ఏదేమైనా, త్వరలోనే తన ప్రాజెక్టులపై నాని ఒక పక్కా క్లారిటీ ఇచ్చి మళ్లీ పాత వేగంతో దూసుకుపోవాలని ఆశిద్దాం..

Tags:    

Similar News