రూట్ మారుస్తోన్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు!
ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. ప్రాంతీయ సరిహద్దులను దాటి కథలు గ్లోబల్ ఆడియన్స్‌ను అలరిస్తున్న వేళ టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం రూట్ మార్చక తప్పడం లేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. ప్రాంతీయ సరిహద్దులను దాటి కథలు గ్లోబల్ ఆడియన్స్‌ను అలరిస్తున్న వేళ టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం రూట్ మార్చక తప్పడం లేదు. ఒకప్పుడు నమ్ముకున్న, అలవాటైన సేఫ్ జోన్ జానర్ల నుంచి బయటకొచ్చి సరికొత్త ప్రయోగాలు చేయడానికి క్రేజీ మేకర్స్ సిద్ధ మవుతున్నారు. ఒకే తరహా ఫార్ములా కథలకు కాలం చెల్లిందని గ్రహించిన టాప్ డైరెక్టర్లు, జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలంటే కంటెంట్‌లో వైవిధ్యం చూపించడమే ఏకైక మార్గమని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్రాజెక్టుల కోసం వారు ఎంచుకుంటున్న సరికొత్త నేపథ్యాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ జాబితాలో ఆశ్చర్యపరుస్తున్న పేరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ . క్లాస్ టచ్, అల్టిమేట్ ఫ్యామిలీ ఎమోషన్స్, పంచ్ డైలాగులతో కూడిన అచ్చమైన తెలుగుదనమున్న సినిమాలకు గురూజీ పెట్టింది పేరు. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా త్రివిక్రమ్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ మైథలాజికల్ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్కు సంభాషణల చాతుర్యానికి, మైథాలజీ బ్యాక్‌డ్రాప్ తోడైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈజానర్ లో సినిమా చేయడం గురూజీకి ఇదే తొలిసారి కావడం విశేషం.
అలాగే మాస్ పల్స్ తెలిసిన కోలీవుడ్ దర్శకుడు అట్లీ సైతం టాలీవుడ్ అగ్ర హీరోతో అత్యంత సాహసోపేతమైన ప్రయోగానికి తెరలేపారు. ఇప్పటి వరకు రివెంజ్ యాక్షన్ డ్రామాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన అట్లీ ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తోన్న `రాకా` మైండ్ బ్లోయింగ్ గ్లోబల్ ప్రాజెక్ట్‌గా లైన్లో పెట్టారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పారలల్ వరల్డ్స్ పథ్యంలో సాగే హై-కాన్సెప్ట్ ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు అట్లీ కమర్షియల్ విలువలకు సైన్స్ ఫిక్షన్ జానర్ తోడవడం అంచనాలను అంతకంతకు పెంచేస్తోంది.
టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాను శాసిస్తున్న ప్రశాంత్ నీల్ సైతం తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌ను మార్చుకుం టున్నారు. `కేజీఎఫ్`, `సలార్` లాంటి చిత్రాలతో డార్క్ షేడ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈసారి ఆ ఫార్ములాను పక్కన పెట్టారు. ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తోన్న `డ్రాగన్` చిత్రం కోసం పూర్తి భిన్నమైన రూట్ ఎంచుకున్నారు. ఈ సినిమాను మునుపటిలా డార్క్ వరల్డ్‌లో కాకుండా క్లాస్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసారు. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్రెజెన్స్‌లో సరికొత్త స్టైలిష్ అండ్ క్లాస్ మేకోవర్ ఎలా ఉండబోతుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాప్ డైరెక్టర్ల భారీ జానర్ మార్పులు నటీనటుల కోసమే కాదు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల కోసం కూడా.నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. దీంతో స్టార్ హీరోల ఇమేజ్‌ను కాపాడుకుంటూనే వారికి సరికొత్త ప్రపంచాలను పరిచయం చేయాల్సిన బాధ్యత దర్శకులపై పడింది. ఈనేపథ్యంలో రెగ్యులర్ కమర్షియల్ కథలను పక్కన పెట్టి ఫ్యాంటసీ, మైథాలజీ, స్టైలిష్ యాక్షన్ వంటి జానర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు టాలీవుడ్ మార్కెట్‌ను వందల కోట్లకు విస్తరించడానికి దోహదపడనుంది.