సైలెంట్ గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్.. ఫోటోలు వైరల్!

యూట్యూబ్ సెన్సేషన్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి పీటలెక్కాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.;

Update: 2026-04-04 05:05 GMT

యూట్యూబ్ సెన్సేషన్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ పెళ్లి పీటలెక్కాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గత కొద్దిరోజుల క్రితమే వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన షన్ను, ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి కూడా కానిచ్చేశాడనే వార్త వైరల్ అవుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తుండటంతో అభిమానులు షాక్‌తో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితుడి పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫోటోగ్రాఫర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.




సైలెంట్ గా ముగిసిన పెళ్లి.. అసలేం జరిగింది?:

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 25న వైష్ణవి చోడిశెట్టితో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న ఈ హీరో, పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా, ఎవరికీ తెలియకుండా కానిచ్చేశాడని టాక్ నడుస్తోంది. షణ్ముఖ్ ప్రాణ స్నేహితుడైన ఒక ఫోటోగ్రాఫర్, తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీలో షన్ను-వైష్ణవిల ఫోటోలు షేర్ చేస్తూ.. "నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరిగింది, ఈ ఫోటోలు షేర్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది" అని పోస్ట్ పెట్టడంతో అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం నిశ్చితార్థం ఫోటోలే చూసిన ఫ్యాన్స్, ఒక్కసారిగా పెళ్లి వార్త వినేసరికి ఆశ్చర్యపోతున్నారు.




దీప్తి సునైనాతో బ్రేకప్.. వైష్ణవితో కొత్త ప్రయాణం:

షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ ప్రారంభం నుండి దీప్తి సునైనాతో ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించినప్పుడు అభిమానులు ఎంతో బాధపడ్డారు. బిగ్ బాస్ తర్వాత వచ్చిన మనస్పర్థల వల్ల వీరి బంధం ముగిసిందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. చాలా కాలం పాటు షన్ను మళ్ళీ దీప్తితో కలుస్తాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు, కానీ షణ్ముఖ్ తన లైఫ్‌లో ముందుకు సాగిపోయాడు. వైష్ణవితో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం వైష్ణవితో పెళ్లి జరిగిపోయిందనే వార్తలతో, దీప్తితో ఉన్న పాత అధ్యాయానికి పూర్తిగా తెరపడినట్లయింది. ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై ఫోకస్ పెట్టి లైఫ్‌లో సెటిల్ అయ్యారు.

యూట్యూబ్ స్టార్ నుంచి వెండితెర హీరో వరకు:

షణ్ముఖ్ ప్రయాణం చాలా చుస్తే, కేవలం యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో తన కెరీర్ మొదలుపెట్టి, నేడు సినిమాల్లో హీరోగా ఎదిగాడు. అతను చేసిన 'సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'సూర్య' లాంటి వెబ్ సిరీస్‌లు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి. ఇప్పటికే ఓటీటీలో 'లీలా వినోదం' అనే సినిమాతో ఆకట్టుకున్న షన్ను, ప్రస్తుతం 'ప్రేమకు నమస్కారం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కూడా రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో వివాహ బంధంతో కొత్త అడుగు వేశాడు. వెండితెరపై కూడా షణ్ముఖ్ మరిన్ని సక్సెస్‌లు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వైరల్ అవుతున్న ఫోటోలు.. క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు:

పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో షణ్ముఖ్, వైష్ణవి జంటపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇద్దరి జోడీ చాలా బాగుందని, ఫోటోల్లో షన్ను ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక ఫోటోగ్రాఫర్ షేర్ చేసిన ఫోటోల్లో తాళి కట్టడం లేదా తలంబ్రాల వంటి మెయిన్ పెళ్లి ఫోటోలు లేకపోవడంతో, అవి కూడా షేర్ చేయాలని నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. షణ్ముఖ్ అధికారికంగా తన పెళ్లి ఫోటోలను ఎప్పుడు షేర్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా షణ్ముఖ్-వైష్ణవి జంట నూతన జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనమూ కోరుకుందాం.

Tags:    

Similar News