బైకర్ Vs రాకాస.. బుకింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది.;

Update: 2026-04-04 06:53 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ ఒకవైపు, నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన రాకాస మరోవైపు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విడుదలకు ముందే ఆ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉండగా, రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడం విశేషం.

సంక్రాంతి తర్వాత పెద్దగా సూపర్ హిట్ సినిమాలు రాకపోవడంతో ప్రేక్షకులు మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమ్మర్ సీజన్‌ లో వచ్చిన బైకర్, రాకాస సినిమాలు సూపర్ రెస్పాన్స్ ను సంపాదించుకుంటున్నాయి. రెండు సినిమాలు కూడా విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావడం, కుటుంబంతో చూసేలా ఉండటం కలిసి వస్తున్న అంశాలుగా కనిపిస్తున్నాయి.

శర్వానంద్ విషయానికి వస్తే, సంక్రాంతి సందర్భంగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. అదే జోష్‌ తో బైకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రమోషన్స్ సమయంలోనే రిజల్ట్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్‌ తో తన మాటను నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక రాకాస విషయానికి వస్తే.. నిహారిక కొణిదెల తన సినిమాను ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు. విడుదలకు ముందే ఫుల్ గా ప్రచారం చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కంటెంట్ ఆ చిత్రానికి ప్రధాన బలం. సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో పిల్లలు థియేటర్లకు రావడం ఆ సినిమాకు ఎక్స్ ట్రా ప్లస్‌ గా మారుతోంది.

అయితే బుకింగ్ ట్రెండ్స్ పరంగా చూస్తే, రాకాస మొదటి రోజు డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బుక్‌ మైషోలో సుమారు 62 వేల టిక్కెట్లు అమ్ముడవ్వడం చిన్న బడ్జెట్ సినిమాకు మంచి కౌంట్ అని చెప్పాలి. అదే సమయంలో బైకర్ కూడా తక్కువేం కాదు. విడుదలైన మొదటి 24 గంటల్లో దాదాపు 44.62 వేల టిక్కెట్లు అమ్ముడవడం ద్వారా సూపర్ కౌంట్ ను నమోదు చేసింది.

ఆ రెండు సినిమాలకు వచ్చిన పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే, వచ్చే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా వీకెండ్, సమ్మర్ సెలవులు కలిసి రావడం థియేటర్లకు ప్రేక్షకులను మరింతగా రప్పించే అవకాశముంది. ఏదేమైనా ఇప్పుడు బైకర్, రాకాస సినిమాలు సమ్మర్ బాక్సాఫీస్‌ కు కొత్త ఊపుని తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో ఎంతటి వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News