కాంచన 3 మొదటి వారాంతం కలెక్షన్స్ ఇవే

Update: 2019-04-22 08:11 GMT
రాఘవ లారెన్స్ నటించిన హారర్ కామెడీ 'కాంచన 3' ఏప్రిల్ 19 న రిలీజ్ అయింది.  ముని.. కాంచన సీరీస్ లో తెరకెక్కిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి.  రివ్యూస్ నెగెటివ్ గా ఉన్నా.. మిక్స్ డ్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.  ఈ సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇక మొదటి వీకెండ్ కలెక్షన్స్ లో కూడా లారెన్స్ తన సత్తా చాటాడు.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాంతానికి రూ.  9.11 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ఒకవైపు నాని కొత్త సినిమా 'జెర్సీ' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నా ఆ పోటీని తట్టుకుని మరీ లారెన్స్ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేయడం గొప్ప విషయమే.  'కాంచన 3' కి ముఖ్యంగా బీ.. సి సెంటర్లలో భారీగా ఆదరణ దక్కుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 3.07 cr
సీడెడ్: 2.06 cr
ఉత్తరాంధ్ర: 0.95 cr
కృష్ణ: 0.70 cr
గుంటూరు: 0.83 cr
ఈస్ట్ : 0.74 cr
వెస్ట్: 0.45 cr
నెల్లూరు: 0.31 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 9.11 cr


Tags:    

Similar News