తెలుగు బిగ్ బాస్ లోకి కమల్ హాసన్

Update: 2018-08-02 09:33 GMT
అరుదైన సందర్భంగా చోటు చేసుకోబోతోంది. తమిళంలో బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ తాజాగా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ  హోస్ట్ గా కాదు అతిథిగానే.. కమల్ హాసన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని బిగ్ బాస్ హౌస్ వద్దకు గురువారం రాగానే స్టార్ మా సీఈవో తోపాటు హోస్ట్ నాని ఆయనకు సాదర స్వాగతం పలికారు.

కమల్ హాసన్ సొంత నిర్మాణ సారథ్యంలో ‘విశ్వరూపం2’ మూవీని తెరకెక్కించాడు. దీనికి ఆయనే దర్శకుడు. తాజాగా ఈ సినిమాను తెలుగులోనూ ఆయన విడుదల చేస్తున్నారు. ఈ  సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఆయన తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంటి సభ్యులతో తన సినిమా అనుభూతులు పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు కానీ రేపటి ఎపిసోడ్ లో కానీ మనం చూడొచ్చు..

ఇక కమల్ బిగ్ బాస్ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చాక సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా విశ్వరూపం2 ఆడియో లాంచ్ చేయనున్నారు. దీనికి తెలుగు సినీ ప్రముఖులను ఆహ్వానించాడు.  విశ్వరూపం1 ఇప్పటికే గ్రాండ్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈరెండో పార్ట్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో పూజాకుమార్ - రాహుల్ బోస్ - శేఖర్ కపూర్ - తదితరులు నటిస్తున్నారు. ఆగస్టు 10న తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 
Tags:    

Similar News