లియోకి ఆస్కార్ మరి కమల్ కి ఏమివ్వాలి?

Update: 2016-03-06 11:30 GMT
ఎన్నాళ్ళనుంచో దోబూచులాడుతున్న ఆస్కార్ ఎట్టకేలకు హాలీవుడ్ నటుడు లియోనార్డోకి దక్కడంతో అతని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రేవెనెంట్ సినిమాలో లియో నటన అద్భుతమంటూ కీర్తిస్తున్నారు. అక్కడ ఆది మానవుడి తరహాలో లియో నటించిన సన్నివేశాలకు అబ్బురపడిపోతున్నారు. జంతువుల తోలుతో చలిని కాచుకోవడం, వాటి ప్రేగులను సైతం వాడుకోవడం చూసిన వారంతా జిగుప్త్సపడుతూనే ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే పోలిక మాట పక్కన బెడితే మన లోకనాయకుడు కమల్ హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం' సినిమాలో ఇలానే ఆటవిక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కొండలపైకి ఎక్కుతున్నప్పుడు బాణం తగిలి కింద పడడం, డేగలు ఆ గాయాలను పొడవడం, ఎద్దుమీద గోచీతో కమల్ చేజ్ వంటి సీన్లు నభూతో అనిపిస్తాయి. ఇంతకీ ఇవన్నీ ఈ మధ్యన తీసినవి కాదు. 20ఏళ్ళ క్రిందటే చిత్రీకరించినవి. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ఒకవేళ పూర్తయివుంటే కమల్ కి కూడా ఆస్కార్ తప్పకుండా లభించేదా? ఆ సినిమా ఎలా వుండేదో ఇళయరాజా స్వరపరిచిన ఈ వీడియో సాంగ్ ని ఓ లుక్కేయండి మరి
Full View

Tags:    

Similar News