• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ''డెవిల్'' ఫస్ట్ లుక్:...

''డెవిల్'' ఫస్ట్ లుక్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్..!

By - Tupaki Desk
Update: 2021-07-05 11:47 GMT
వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్న కల్యాణ్ రామ్.. తాజాగా ''డెవిల్'' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లో వస్తున్న 21వ మూవీ. ఇప్పటికే విడుదల చేయబడిన '#NKR21' ప్రీలుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించి. ఈ క్రమంలో తాజాగా ''డెవిల్'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పేర్కొంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

'డెవిల్' టైటిల్ కథానాయకుడి క్రూరత్వాన్ని సూచిస్తుంది. దీనికి 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్‌ లైన్‌ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ తుపాకీ పట్టుకొని రైలుకు వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఇందులో బ్లేజర్ మరియు పంచెకట్టు ధరించి ఉన్న కళ్యాణ్ రామ్.. పొడవాటి జుట్టు గడ్డం మీసాలతో మ్యాన్లీగా ఉన్నాడు. ట్రైన్ మీద ఇండియన్ ఫ్లాగ్ తో కొందరు వ్యక్తులు ఉండటం చూస్తుంటే.. కళ్యాణ్ రామ్ పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అతని తలకు దెబ్బలు.. ఛాతీ గాయం నుంచి రక్తం కారడం మనం గమనించవచ్చు. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ - హీరో గెటప్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

1945లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేయబడిన ''డెవిల్''.. ఒక చీకటి రహస్యాన్ని చేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథ. చరిత్రలో రాయబడని ఓ అధ్యాయాన్ని ఈ చిత్రంలో వెల్లడించనున్నారు. కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ చేయని సరికొత్త థీమ్ తో వస్తున్నాడు. 'పుష్ప' రచయిత శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్‌ తో ''డెవిల్'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Full View
Tags:    
  • Nandamuri Kalyanram 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS