మరో సినిమా అంటే.. కండిషన్స్ అప్లై

Update: 2015-09-02 01:55 GMT

దర్శకుడు తేజ. ముక్కోపి అని అందరికీ తెలిసిందే. సన్నివేశం తను కోరుకున్నట్టు రాలేదంటే శివతాండవం చేస్తాడు. అందుకే స్టార్స్ తో కాకుండా కొత్త వాళ్ళతో చేస్తూ వారిని సతాయిస్తాడు. అప్పుడప్పుడూ మాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తాడట. నటీనటులనే అనుకుంటే సాంకేతిక నిపుణలతోనూ ఇదేవరుసట. సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

హోరాహోరి సినిమా సంగీతం అందించేటపుడు ఇలాంటి పాట కావాలి అలాంటి ట్యూన్ కావలి అని ఇబ్బంది పెట్టకుండా క్రియేటివిటీ పరంగా స్వేఛ్చగా వదిలేశాడట. కానీ ఏం చేసినా నా ముందే చెయ్యాలి అని పట్టుబట్టాడట. తనకళ్ళ ముందే అంతా జరగాలి అనుకుంటాడట తేజ. ఇలాంటివి కొన్ని కళ్యాణ్ కి ఇరకాటంగా అనిపించాయి. దీంతో కథ ఎక్కడివరకూ వెళ్లిందంటే.. మరోసారి తేజతో పని చెయ్యాల్సి వస్తే గనక కొన్ని కండీషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చిన రాజమౌళి, కీరవాణిల సోదరుడు తన కెరీర్ లో సంతృప్తినిచ్చిన ఆల్బం మాత్రం హోరాహోరి అని అంటున్నారు. ఇదేం లెక్కో మరి..?!
Tags:    

Similar News