రేటు తగ్గించి స్లిమ్ అయితే ఇన్ని ఆఫర్లా?
కాజల్ అగర్వాల్ ఇపుడు సౌత్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. గతేడాది పరిస్థితి ఇలా లేదు. అమ్మడి అకౌంట్ లో సరైన సినిమా కూడా లేదు. కనీసం సైన్ కూడా చేయకుండా ఏడాది గడిపేసింది. దీనికి కారణం మంచి బూమ్ లో ఉన్న టైంలో .. భారీగా రేటు పెంచేయడమే. కోటిన్నర ఇస్తేనే మూవీకి సైన్ చేస్తానంటూ మంకు పట్టు పట్టేసింది చందమామ.
గ్లామర్ విషయంలో కాస్త పొదుపు పాటించే కాజల్ కి అంత ఇచ్చుకునేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవడంతో ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు విషయం బోధపడ్డాక అమ్మడు సన్నబడ్డం మొదలుపెట్టి, అదే టైంలో రెమ్యూనరేషన్ విషయంలోనూ మెత్తబడింది. దీంతో వరుసగా ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. తెలుగులో అయితే రెండు భారీ ఆఫర్స్ చేతికొచ్చాయి. పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ -మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాలు చేస్తూ.. మరోసారి టాప్ హీరోయిన్ ప్లేస్ కి గురి పెట్టింది.
తమిళ్ లో కూడా ఒకేసారి నాలుగు సినిమాలకు కాజల్ సైన్ చేసేయడం విశేషం. తెలుగు - తమిళ్ లో రూపొందనున్న ఓ ద్విభాషా చిత్రంతో పాటు జీవాకు జంటగా కవలై వేండామ్ లోను - విక్రమ్ హీరోగా తిరు డైరెక్షన్ లో రానున్న మూవీకి కూడా హీరోయిన్ గా ఎంపికైంది. విజయ్ కు జంటగా కూడా మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. అలాగే దో లఫ్జోంకీ కహానీ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. మొత్తానికి రేటు తగ్గించి, స్లిమ్ అయ్యాక.. కాజల్ కి వరుసగా ఆఫర్లు వచ్చిపడిపోతున్నాయి.