అక్కడ ఫేట్‌ మార్చేసుకున్న కాజల్‌

Update: 2016-07-10 07:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి కెరీర్ పరంగా ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోందని అంగీకరించాల్సిందే. ఛాన్సుల విషయంలో కాకపోయినా.. చేస్తున్న సినిమాల రిజల్ట్ విషయంలో మాత్రం తేడా కొడుతోంది. కొన్నినెలల క్రితం అయితే ఈ అమ్మడి కంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరనే పరిస్థితి. వరుసగా పవన్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ - మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం చిత్రాలు డిజాస్టర్లుగా మిగలడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సుందరాంగికి దో లఫ్జోంకి కహాని పెద్ద షాక్ నే ఇచ్చింది. అయినాసరే ఆమె అదృష్టం ఎలా ఉందో తెలుసా??

తమిళంలో గతేడాది నుంచి ఈమెకు బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. మారి.. పాయుమ్ పులి ఫ్లాప్ లతో డీలా పడ్డ పరిస్థితి. ఇంతటి బ్యాడ్ టైమ్ లో కూడా అజిత్ నెక్ట్స్ సినిమాలో కాజల్ కి ఛాన్స్ దక్కడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. మొదట ఈ రోల్ కి అనుష్కను అనుకున్నారు కానీ.. చివరకు నిర్మాతలు కాజల్ కే మొగ్గు చూపారు. తన కెరీర్ లో కంటిన్యూ అవుతున్న డిజాస్టర్ల ట్రెండ్ కు.. అజిత్ మూవీతో కాజల్ చెక్ పెట్టే చాన్సులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా.. విజయ్‌ తదుపరి సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఆల్రెడీ జీవాతో ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు తెలుగులో రానా అండ్ తేజ కాంబినేషన్ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్.

ఇంతకీ కాజల్ అదృష్టం ఇలా టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటారు? మామూలుగా తెలుగులో అయితే 2 కోట్లు కావాలనే కాజల్.. తమిళంలో మాత్రం 75 లక్షలకే ప్రాజెక్టులు చేస్తోందట. ఇప్పుడు అక్కడ నయనతార, శృతి హాసన్‌ వంటి భామలకంటే ఇంత చీప్‌ గా అమ్మడు సినిమా ఓకె చేస్తుంటే.. ఏ హీరో మాత్రం కాదంటాడు. ఆ విధంగా తన ఫేట్ తానే మార్చుకుంటోంది కాజల్!!
Tags:    

Similar News