అప్పుడే ఆ దర్శకుడిని పిలిచి మెగా ఆఫరిచ్చారా?
టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించే ఒక అగ్ర కథానాయకుడి కంబ్యాక్ సినిమాకి దర్శకత్వం వహించి క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ప్రముఖ దర్శకుడికి.. అలాగే రీమేక్ కథే అయినా ఆ సినిమాని బంపర్ హిట్ చేసేంతగా గొప్ప సాంకేతిక నిర్మాణ విలువలతో సినిమా తీసినందుకు సదరు నిర్మాతను మెగాస్టార్ తన ఇంటికి పిలిచి మరీ ప్రశంసించారని.. అలాగే తదుపరి తనతో ఓ సినిమా చేసేందుకు ముందుకు రావాలని కోరారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం.. అటుపై పరిశ్రమ పెద్దన్న తమను పిలిచి అలా మాట్లాడడంతో సదరు దర్శకనిర్మాతలిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్ సొంత బ్యానర్ కొణిదెల కాంపౌండ్ టై అప్ తో సదరు నిర్మాత ఆ దర్శకుడితో మరో సినిమాని నిర్మించే అవకాశం లేకపోలేదన్న గుసగుసా వినిపిస్తోంది.
ఏదేమైనా ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ ఉత్సాహమే వేరు. వెంట వెంటనే అవకాశాలు వెంటపడతాయి. ఊహించని ఆఫర్లు వస్తుంటాయి. ఆ ఉత్సాహం ఆ యువదర్శకుడిలో స్పష్ఠంగా కనిపిస్తోంది. తమ్ముడికి హిట్టిస్తే అన్నయ్యతో ఆఫర్ ఖాయమన్న టాక్ ఇటీవల స్ప్రెడ్ అవ్వగా ఇప్పుడు ఏకంగా ఇంటికి పిలిచి ప్రశంసించడంతో ఈ కాంబినేషన్ కి జాక్ పాట్ తగిలినట్టేనన్న టాక్ స్ప్రెడ్ అయిపోతోంది. సెంటిమెంటు పరిశ్రమ సక్సెస్ ను మాత్రమే నమ్మేది ఎందుకో ఇప్పటికైనా అర్థమవుతోంది కదూ?