పాన్ ఇండియా ఫేమ్ కోసం తారక్ కు కలిసొచ్చే అంశాలు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన నటుడో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి తన పెర్ఫార్మ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.. ఎంత పెద్ద డైలాగ్ అయినా అవలీలగా చెప్పేస్తుంటారు.
ఇప్పటి వరకు తన సత్తా ఏంటో టాలీవుడ్ కు మాత్రమే చూపించిన తారక్.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ మూవీలో కొమురం భీమ్ గా నందమూరి హీరో అదరగొట్టాడు.
ముఖ్యంగా 'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. నిజానికి ఈ సాంగ్ మ్యూజిక్ వీడియో వచ్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయింది. దీనికి కారణం అందులో అద్భుతంగా అభినయించిన తారక్ అనే చెప్పాలి.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా 'కొమురం భీముడో' పాట గురించి.. అందులో ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. తారక్ నటన గురించి దక్షిణాది ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసింది.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టామినాపై సందేహాలు ఉన్న ఉత్తరాది వారందరూ.. ఈ పాటలో ఎన్టీఆర్ నటనా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తారక్ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ పెంచుకోడానికి.. మార్కెట్ ను విస్తరించుకోడానికి తోడ్పాటు అందిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్.. తెలుగుతో పాటుగా తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీషులతో పాటుగా పలు ఇతర భాషల్లో మాట్లాడగలరు. ఇది పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి కలిసొచ్చే అంశం.
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాని పాన్ ఇండియాకి తగ్గట్టుగానే రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ మూవీ చేయనున్నారు. మధ్యలో బుచ్చిబాబుతో పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిల్మ్ ఉందని టాక్ నడుస్తోంది.
RRR సక్సెస్ మరియు ఇందులో ఎన్టీఆర్ నటన ఉత్తరాది జనాలను ఆకర్షించిన నేపథ్యంలో.. త్వరలో చేయబోయే పాన్ ఇండియా సినిమాపై కచ్చితంగా బాలీవుడ్ దృష్టి పడుతుంది. ఇక ఎవరైనా బాలీవుడ్ దర్శకుడితో తారక్ ఓ మూవీ సెట్ చేస్తే స్టార్ హీరో రేంజ్ ఏంటో అందరికీ అర్ధం అవుతుంది. మరి మునుముందు ఎన్టీఆర్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.