ఫోటోటాక్‌ : యూఎస్ లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ రచ్చ కంటిన్యూ

Update: 2022-03-20 07:30 GMT
ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా సమయం కేటాయించాడు. కరోనా వల్ల ఇంకాస్త ఎక్కువ ఆలస్యం అయ్యింది. ఆలస్యం అయినా కూడా అద్భుతమైన ఫలితం సినిమా దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సన్నివేశంలో కూడా ఎన్టీఆర్‌ ను ఒక పులి మాదిరిగా జక్కన్న చూపించినట్లుగా ట్రైలర్‌ మరియు మేకింగ్ వీడియోలను చూస్తుంటే అనిపిస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో.. దేశం మొత్తం మీద కాకుండా అమెరికాలో కూడా సందడి చేస్తున్నారు. ఆమద్య కార్ల తో పెద్ద ఎత్తు ఎన్టీఆర్‌ పేరును ప్రదర్శించి చర్చనీయాంశం అయ్యారు. ఆ తర్వాత విమానం వెనుక బ్యానర్‌ ను కట్టి ఎన్టీఆర్‌ మరియు ఆర్ ఆర్‌ ఆర్‌ డైలాగ్‌ ను పెట్టి సందడి ఆశ్చర్యపర్చారు. సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ అభిమానులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు అనే విషయం తెల్సిందే.

ఇప్పుడు అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి కొనసాగుతోంది. సాదారణంగా అయితే సినిమా ను యూఎస్ లో విడుదల చేసిన వారు ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. కాని ఈ సినిమా ను మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ప్రమోట్‌ చేసుకుంటున్నారు. టెక్సాస్ లో బిల్ బోర్డ్‌ డిస్‌ ప్లే ను ఏర్పాటు చేసి మరీ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌ పోస్టర్ తో పాటు సీనియర్ ఎన్టీఆర్‌ ఫోటో ను డిస్ ప్లే చేసి ఎన్టీఆర్‌ పై తమకు ఉన్న అభిమానం ను చాటుకునే ప్రయత్నం చేశారు.

అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్లను కూడా అత్యధికంగా ఎన్టీఆర్‌ అభిమానులు కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్ అభిమానులతో పోటీ పడి మరీ వారు టికెట్లను అత్యధికంగా అత్యధిక రేటుకు కొనుగోలు చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్‌ అభిమానులతో పోల్చితే అమెరికాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానుల సందడి ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌ లుగా కనిపించబోతున్న ఈ సినిమా తో మరోసారి రాజమౌళి ప్రేక్షకులకు విజువల్‌ వండర్ అంటే ఏంటీ అనేది చూపించబోతున్నారు. ఈ సినిమా రెండు వేల కోట్లు.. మూడు వేల కోట్ల వసూళ్లు సాధిస్తుంది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎంత వసూళ్లు దక్కించుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News